కోనరావుపేటను కోనసీమగా మారుస్తా

ABN , First Publish Date - 2022-09-25T06:18:20+05:30 IST

కోనరావుపేట మండలాన్ని కో నసీమగా మారుస్తానని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు అన్నారు. కోనరావుపేట మండలంలోని రూ. 12 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శనివారం భూమిపూజ చేశారు.

కోనరావుపేటను కోనసీమగా మారుస్తా
చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే రమేష్‌బాబు, జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ

- వేములవాడ ఎమ్మెల్యే రమేష్‌బాబు

కోనరావుపేట, సెప్టెంబరు 24 : కోనరావుపేట మండలాన్ని కో నసీమగా మారుస్తానని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు అన్నారు. కోనరావుపేట మండలంలోని రూ. 12 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శనివారం భూమిపూజ చేశారు. అదేవిధంగా  మామిడిపల్లి-అజ్మీరాతండా రోడ్డు కోసం రూ.4 కోట్లు, మామిడిపల్లి-నిజామాబాద్‌ రోడ్డుకు రూ.1.30 కోట్లు, నిమ్మపల్లి-అజ్మీరాతండా రోడ్డుకు రూ. 3 కోట్లు, మర్తనపేట-కొలనూరు సీసీ రోడ్డు నిర్మాణాలకు రూ. 80 లక్షలతో  భూమిపూజ చేశారు. మల్కపేటలో భూములు కోల్పోయిన గౌడ సంఘానికి రూ. 16 లక్షలు, నిజామాబాద్‌, కోనరావుపేటలో దళితబంధు చెక్కులను అందజేశారు. కోనరావుపేటలో  నూతన పింఛన్లు, బతుకమ్మ చీరలు, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను అందజేస్తున్నామన్నారు. కోనరావుపేట మండలాన్ని అభివృద్ధిలో ముందుంచామన్నారు. 

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా  పని చేస్తోందని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఎమ్మెల్యే రమేష్‌బాబుతో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆడపడుచులందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బతుకమ్మ చీరలను అందిస్తున్నారన్నారు. ప్రతీ ఇంటికి ఏదోవిధంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు.  ఎంపీపీ చంద్రయ్యగౌడ్‌, ఫ్యాక్స్‌ చైర్మన్‌లు బండ నర్సయ్య, రామ్మోహన్‌రావు, తహసీల్దార్‌ నరేందర్‌, ఎంపీడీవో రామకృష్ణ, సెస్‌ డైరెక్టర్‌ దేవరకొండ తిరుపతి, సర్పంచ్‌లు రేఖ, అరుణ జగన్‌రెడ్డి, భారత, వంశీరావు, లత, ఎంపీటీసీ చారి,  సెస్‌ డైరెక్టర్‌ దేవరకొండ తిరుపతి, మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.


Read more