వరద బాధితులను కాంగ్రెస్‌ పార్టీ పక్షాన ఆదుకుంటాం

ABN , First Publish Date - 2022-08-21T05:42:56+05:30 IST

వరద బాధితులకు కాంగ్రెస్‌ పార్టీ పక్షాన ఆదుకుం టామని డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు.

వరద బాధితులను కాంగ్రెస్‌ పార్టీ పక్షాన ఆదుకుంటాం
వరద బాధితులకు బియ్యం పంపిణీ చేస్తున్న లక్ష్మణ్‌కుమార్‌

డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

ధర్మపురి, ఆగస్టు 20: వరద బాధితులకు కాంగ్రెస్‌ పార్టీ పక్షాన ఆదుకుం టామని డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. ధర్మపురి పట్టణంలో ని కర్నె అక్కపెల్లి కళ్యాణ మండపంలో టీపీసీసీ ఆధ్వర్యంలో 400 మంది వరద బాధితులకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల అనేక కుటుంబాలకు తీవ్రంగా నష్టం వాటిల్లినాదని తెలి పారు. ఇలాంటి సమయంలో వరద బాధితులను ఆదుకునేందుకు టీపీసీసీ అధ్య క్షులు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ ముందుకు వచ్చినట్లు ఆయన పే ర్కొన్నారు. వరద బాధితుల కోసం రూ 2 లక్షలు విలువ గల 50 క్వింటాళ్లు బి య్యం కొనుగోలు చేసి పంపిణీ చేసినట్లు తెలిపారు. అంతకు ముందు రాజీవ్‌ గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ధర్మపురి మండల అధ్యక్షులు సం గనభట్ల దినేష్‌, ఉపాధ్యక్షులు వేముల రాజేష్‌, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ వేముల నాగలక్ష్మి, కౌన్సిలర్‌ గరిగె అరుణ, జిల్లా కాంగ్రెస్‌ కార్యదర్శి శ్రీనివాస్‌, లక్ష్మణ్‌, యువజన కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షులు సింహరాజు ప్ర సాద్‌, మండల అధ్యక్షులు రాందేని మొగిలి, సత్యనారాయణ, మహేష్‌, జైస్‌కిరణ్‌ సుముఖ్‌, స్తంభంకాడి గణేష్‌, లక్ష్మణ్‌, మహేందర్‌ పాల్గొన్నారు. 

Read more