అర్చక పోస్టుల భర్తీపై అయోమయం

ABN , First Publish Date - 2022-11-28T01:31:47+05:30 IST

కొండగ ట్టు అంజన్న సన్నిధిలో ఖాళీగా ఉన్న అర్చక పోస్టుల భర్తీ కోసం నోటిఫికే షన్‌ జారీ కాగా దరఖాస్తుల సమర్ప ణపై అయోమయం నెలకొంది.

అర్చక పోస్టుల భర్తీపై అయోమయం
కొండగట్టు ఆలయం

ఫవంశపారంపర్యులకే అవకాశం ఇవ్వాలని కోర్టుకు..

ఫముగిసిన దరఖాస్తుల స్వీకరణ

మల్యాల, నవంబరు 27: కొండగ ట్టు అంజన్న సన్నిధిలో ఖాళీగా ఉన్న అర్చక పోస్టుల భర్తీ కోసం నోటిఫికే షన్‌ జారీ కాగా దరఖాస్తుల సమర్ప ణపై అయోమయం నెలకొంది. నాలు గు అర్చక పోస్టుల భర్తీకి గత నెలలో నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఆదివా రంతో దరఖాస్తుల గడువు ముగియ గా మొత్తం 23 మంది అర్చక పోస్టు లకు దరఖాస్తులు సమర్పించారు. ఇ ప్పటికే అర్చక పోస్టుల భర్తీపై అనేక విమర్శలు వెల్లువెత్తుతుండగా తాజా గా నోటిఫికేషన్‌పై తిరునగిరి హరికృ ష్ఞ ప్రసాద్‌ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించడంతో డిసెంబరు 12 వరకు ఎలాం టి ప్రక్రియ చేపట్టకూడదని స్టే వచ్చింది. కోర్టు స్టే ఆదేశాలు తమకు అందలే దంటూ అధికారులు చివరి రోజు ఆదివారం వరకు దరఖాస్తులు స్వీకరించా రు. చివరి రోజు ఎనిమిది దరఖాస్తులు రాగ, స్టే వచ్చిందని సమాచారం వచ్చి నప్పటికీ దరఖాస్తులు తీసుకోవడం, తీసుకున్న వాటికి రసీదు ఇవ్వకసోవ డం పై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై అధికారుల ను దరఖాస్తుదారులు సంప్రదించినా రసీదులు ఇవ్వలేదు. కోర్టు స్టే ఇచ్చిన నే పథ్యంలో దరఖాస్తుల స్వీకరణ నిలిపితే మరి కొంత మంది అర్హులైన వారు దరఖాస్తులు సమర్పించే అవకాశం ఉండేదని వారు అంటున్నారు. అయితే స్టే విషయమై దేవస్థానం అధికారులను సంప్రదించగా ఉన్నతాధికారుల ఆదేశా ల మేరకు నడుచుకుంటామన్నారు.

ఫవంశపారంపర్యులకే అవకాశం ఇవ్వాలని..

అర్చక పోస్టుల భర్తీలో వంశపారంపర్యులకే అవకాశం ఇవ్వాలని హరికృష ప్రసాద్‌ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించడంతోనే స్టే వచ్చినట్లు తెలుస్తోంది. రా ష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు వంశపారంపర్య ఆలయాల్లో వారికే అవకాశం ఇచ్చారని ఇక్కడ కూడా అలాగే చేయాల్సి ఉందని అర్చకులు పేర్కొంటున్నా రు. నోటిఫికేషన్‌ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు చేసుకునే అవకాశం క లుగడంతో వంశపారంపర్యులకు నష్టం జరుగుతుందని వారు అంటున్నారు.

Updated Date - 2022-11-28T01:31:49+05:30 IST