ముగిసిన సీఐటీయూ మహాసభలు

ABN , First Publish Date - 2022-12-13T00:18:25+05:30 IST

ఎన్టీపీసీలో ఈనెల 10, 11న జరిగిన సీఐటీయూ జిల్లా మహాసభలు విజయవంతంగా ముగిశాయని, మొత్తం 14 తీర్మాణాలను సభ ఏకగ్రీవంగా ఆమోదించిందని ఆ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు ముత్యంరావు తెలి పారు.

ముగిసిన సీఐటీయూ మహాసభలు

జ్యోతినగర్‌, డిసెంబరు 12 : ఎన్టీపీసీలో ఈనెల 10, 11న జరిగిన సీఐటీయూ జిల్లా మహాసభలు విజయవంతంగా ముగిశాయని, మొత్తం 14 తీర్మాణాలను సభ ఏకగ్రీవంగా ఆమోదించిందని ఆ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు ముత్యంరావు తెలి పారు. సోమవారం యూనియన్‌ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా ఏర్పడి 6 ఏళ్లు దాటుతున్నప్పటికీ డీసీఎల్‌ స్థాయి కార్మిక అధికారిని నియమించ లేదని, దీంతో అనేక కార్మిక సమస్యలు పెండింగులో ఉంటున్నాయన్నారు. వెంటనే డీసీఎస్‌ పోస్టును భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. పారిశ్రామిక ప్రాంతంలో 200 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రిని తక్షణం నిర్మించాలని, గోదావరిఖని లేబర్‌ కోర్టుకు వెంటనే జడ్జిని నియమించాలని, గోదావరిఖనిలో మైనిం గ్‌ యూనివర్శిటీని నెలకొల్పాలని, రాష్ట్ర ప్రభుత్వం పెండింగులో పెట్టిన 73 రకాళ షె డ్యూల్‌ ఎంప్లాయిమెంట్‌కు సంబంధించి కనీస వేతనాల జీవోలను విడుదల చేయా లని, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల కొత్త వేతన సవరణ ఓప్పందం చేయాలని, గత ఒప్పందంలోని అంశాలను పూర్తి స్థాయిలో అమలుచేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సింగరేణి కాంట్రాక్టు కార్మి కులకు హైపవర్‌ వేతనాలు చెల్లించాలని, హమాలీ, ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు కార్మికుల కు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పెన్షన్‌, గుర్తింపు కార్డు, పని భద్రత తదితర డిమాండ్లను నెరవేర్చాలన్నారు. మున్సిపల్‌ కార్మికులకు పెరిగిన వేతనాల ఏరియర్స్‌ ను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రానున్న కాలంలో సీఐటీయూ ఆధ్వర్యం లో సమరశీల పోరాటాలు చేస్తామని, అందుకు జిల్లా మహాసభలు దోహద పడ్డాయ ని ముత్యంరావు తెలిపారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి, రామా చారి, నాంసాని శంకర్‌, గీట్ల లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:18:25+05:30 IST

Read more