మల్లన్న ఆలయ అభివృద్ధికి కమిటీ ప్రతిపాదనలు

ABN , First Publish Date - 2022-07-18T05:55:01+05:30 IST

మల్లికార్జునస్వామి క్షేత్రంలో ఆదివారం ధర్మకర్తల మండలి మొదటి సమావేశాన్ని నిర్వహించారు.

మల్లన్న ఆలయ అభివృద్ధికి కమిటీ ప్రతిపాదనలు
ధర్మకర్తల మండలి సమావేశంలో పాల్గొన్న సభ్యులు

ఓదెల, జూలై 17 : మల్లికార్జునస్వామి క్షేత్రంలో ఆదివారం ధర్మకర్తల మండలి మొదటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం పారదర్శకంగా అభివృద్ధి జరిగేందుకు ధర్మకర్తల మండలి సమష్టిగా ప్రతిపాదనలు తయారుచేశా రు. రాజగోపురాల నిర్మాణం, ఆలయ భూముల సరిహద్దుల ఏర్పాటు, సులభ్‌ కాంప్లె క్స్‌ల నిర్మాణం, మల్లన్న కుంట స్థలం వివరాలు ప్రభుత్వానికి సమర్పించేందుకు తీ ర్మానించారు. అలాగే భక్తులు స్వయంగా నిర్మించే గృహలకు పర్మిషన్‌ తీసుకోవడం, ముఖ మంటపంపై కప్పు, మరమ్మత్తు చేసేందుకు, విద్యుత్‌ కాంతులు ఏర్పాటుతో పాటు ఆలయంలో రథంపై ఏర్పాటు చేసేందుకు చైర్మన్‌ మల్లేశంతో పాటు కమిటీ సభ్యులు, ముఖ్యఅర్చకులు ప్రతిపాదనలు తయారుచేశారు. ఈ కార్యక్రమంలో చైర్మ న్‌తో పాటు ఈవో సదయ్య, ధర్మకర్తలు పాల్గొన్నారు. 

Read more