సమస్యలను పరిష్కరించాలని బైఠాయింపు

ABN , First Publish Date - 2022-09-17T05:50:08+05:30 IST

మంత్రి కేటీఆర్‌ తమ సమస్యలను పరిష్క రించాలని సుంకరి ఇస్సాదారులు శుక్రవారం రాత్రి కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించారు. సిరిసిల్ల పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్‌ సాయంత్రం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.

సమస్యలను పరిష్కరించాలని బైఠాయింపు
కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించిన సుంకరి ఇస్సాదారులు

సిరిసిల్ల కలెక్టరేట్‌, సెప్టెంబరు 16: మంత్రి కేటీఆర్‌ తమ సమస్యలను పరిష్క రించాలని సుంకరి ఇస్సాదారులు  శుక్రవారం రాత్రి కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించారు. సిరిసిల్ల పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్‌ సాయంత్రం  కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.  విషయం తెలుసుకున్న సుంకరులు మంత్రిని కలిసేందుకు  వచ్చారు. పోలీసులు కలెక్టరేట్‌ ప్రధాన ద్వారాన్ని మూసి వేయడంతో రోడ్డుపై బైఠాయించారు. సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్‌ చేశారు. దీంతో అక్కడే ఉన్న వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి వారితో మాట్లాడి మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు ఆరుగురిని కలెక్టరేట్‌లోకి పంపించారు. మంత్రి కేటీఆర్‌ను కలిసిన వారు సమస్యలను విన్నవించి పరిష్కరించాలని కోరారు. సుంకరుల సమస్యలపైనే ప్రస్తుతం చర్యలు జరుగుతున్నాయని త్వరలోనే   పరిష్కరించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బైఠాయింపును విరమించారు.  

Read more