సీఎంఆర్‌ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అందించాలి

ABN , First Publish Date - 2022-09-30T05:06:48+05:30 IST

ఖరీప్‌ సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్‌ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అందించాలని అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ రైస్‌మిల్లర్లను ఆదేశించారు.

సీఎంఆర్‌ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అందించాలి
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌

-  అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌

సిరిసిల్ల కలెక్టరేట్‌, సెప్టెంబరు 29: ఖరీప్‌ సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్‌ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అందించాలని అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ రైస్‌మిల్లర్లను ఆదేశించారు. సిరిసిల్ల  కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం ఖరీఫ్‌ 2021-22 సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్‌ బియ్యం సరఫరాపై రైస్‌మిల్లర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్‌లో 2 కోట్ల 67 లక్షల 158.360 టన్నుల ధాన్యాన్ని మిల్లర్లకు ఇవ్వగా మొత్తం కోటి 78 లక్షల 996.101 టన్నుల సీఎంఆర్‌ బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 84 లక్షల 938.500 టన్నుల సీఎంఆర్‌ బియ్యాన్ని సరఫరా చేయడం జరిగిందని అన్నారు. మిగిలిన 94 లక్షల 057.601 టన్నుల సార్టేక్స్‌ మిషన్‌ను కచ్చితంగా అమర్చుకోని సీఎంఆర్‌ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అందించాలని సూచించారు. సార్టేక్స్‌ మిషన్‌ అమర్చుకున్న రైస్‌మిల్లులకు మాత్రమే వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో పండిన ధాన్యాన్ని ఇస్తామని తెలిపారు. సమావేశంలో డీసీఎస్‌వో జితేందర్‌రెడ్డి, మేనేజర్‌ హరికృష్ణ, డీటీసీఎస్‌లు నవీన్‌కుమార్‌, రవీంద్రచారి, రైస్‌మిల్లర్లు పాల్గొన్నారు. 


Read more