-
-
Home » Telangana » Karimnagar » CM promises should be implemented-NGTS-Telangana
-
సీఎం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
ABN , First Publish Date - 2022-08-17T06:03:28+05:30 IST
అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణం అమలు చేయాలని వీఆర్ఏల సంఘం డివిజన్ అధ్యక్షుడు రాధాశంకర్ డిమాండ్ చేశారు.

సిరిసిల్ల టౌన్, ఆగస్టు 16 : అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణం అమలు చేయాలని వీఆర్ఏల సంఘం డివిజన్ అధ్యక్షుడు రాధాశంకర్ డిమాండ్ చేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మంగళవారం సిరిసిల్ల దీక్ష శిబిరం వద్ద జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ముఖ్యమంత్రి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రాధాశంకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 23 వేల మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారన్నారు. అపరిస్కృతంగా ఉన్న వీఆర్ఏల పే స్కేల్, పదోన్నతులు, వారసత్వ ఉద్యోగాలు ఇతర సమస్యలను పరిష్కరించాలన్నారు. వీఆర్ఏల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 23 రోజులుగా సమ్మెతోపాటు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించక పోవడం బాధాకరమన్నారు. వీఆర్ఏల మండల అధ్యక్షుడు కొంపెల్లి నర్సయ్య, నాయకులు భాను, కాసు రామచంద్రం, మ్యాకల భిక్షపతి, సిరిసిల్ల లక్ష్మిపతి, సిరిగిరి నవీన్‌కుమార్, సాయి, లక్ష్మినారాయణ, శ్రీకాంత్, చంద్రకళ, కవిత, మమత పాల్గొన్నారు.