విద్యారంగానికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట

ABN , First Publish Date - 2022-11-24T00:28:16+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు. గోదావరిఖనిలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న రామగుండం నియోజకవర్గ స్థాయి బాలోత్సవ్‌-2022 కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక మార్కండేయకాలనీలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన వేడుకకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు.

విద్యారంగానికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట
్యోతిప్రజ్వలన చేస్తున్న ఎమ్మెల్యే చందర్‌, మేయర్‌ అనిల్‌కుమార్‌

కోల్‌సిటీటౌన్‌, నవంబర్‌ 23: తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు. గోదావరిఖనిలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న రామగుండం నియోజకవర్గ స్థాయి బాలోత్సవ్‌-2022 కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక మార్కండేయకాలనీలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన వేడుకకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. రాష్ట్రంలో పేద విద్యార్థుల కోసం సుమారు వెయ్యి గురుకులాలతో పాటు ఒక్కొ విద్యార్థికి 1,25,000 రూపాయలను సీఎం ఖర్చుచేస్తున్నారని తెలిపారు. లక్ష ఉద్యోగాలతో నోటిఫికేషన్‌ ఇచ్చి ఉపాధి అవకాశాలను కల్పించిన ఏకైక నాయకుడు కేసీఆర్‌ అని కొనియాడారు. అలాగే పిల్లలలో ఉన్న ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడమే తమ ప్రయత్నమని, అందులోభాగమే ఎక్కడా లేని విధంగా రామగుండం నియోజకవర్గంలో మూడేళ్లుగా బాలోత్సవ్‌ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఫలితంగా వారిలోని ప్రతిభ, నైపుణ్యం వెలికి వచ్చేందుకు దొహదపడుతున్నాయన్నారు. రాబోయే పదోతరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు అత్త్యుత్తమ ఫలితాలు సాధించి ఈ ప్రాంతానికి పేరును తీసుకురావాలన్నారు. ఈ ప్రాంత విద్యార్థి భవిష్యత్‌ బంగారుమయం కావడం కోసం తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ నడపెల్లి అభిషేక్‌రావు, కార్పొరేటర్లు బాలరాజ్‌కుమార్‌, జనగామ కవితాసరోజిని, ట్రస్మా నాయకులు అమరేందర్‌, కొత్త శ్రీనివాస్‌రెడ్డి, కంది రవీందర్‌రెడ్డి, తిరుపతి, నాగరాజు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఆడప శ్రీనివాస్‌, నూతి తిరుపతి, కళాకారులు మేజిక్‌రాజా, దామెర శంకర్‌, శ్రావణ్‌, దిలీప్‌, జవహర్‌, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే స్థానిక మార్కండేయకాలనీలోని సిద్ధార్థ హైస్కూల్‌లో జరిగిన బాలోత్సవ్‌ కార్యక్రమంలో ఎమ్మెల్యే చందర్‌ పాల్గొని మాట్లాడారు. అనంతరం పాఠశాల యాజమాన్యం చందర్‌ను శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో మేయర్‌ అనిల్‌కుమార్‌, కార్పొరేటర్లు, ట్రస్మా నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T00:28:20+05:30 IST