సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం

ABN , First Publish Date - 2022-01-03T06:59:27+05:30 IST

సీఎం సహాయనిధి పథకం నిరుపేదలకు వరమని జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు దావ వసంత, ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు.

సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం
చెక్కులు అందజేస్తున్న జడ్పీ చైర్‌ పర్సన్‌, ఎమ్మెల్యే

జడ్పీ చైర్‌ పర్సన్‌ వసంత, ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

జగిత్యాల టౌన్‌, జనవరి 2 :సీఎం సహాయనిధి పథకం నిరుపేదలకు వరమని జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు దావ వసంత, ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు. పట్టణంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఆదివా రం జగిత్యాల పట్టణ, రూరల్‌, అర్బన్‌ మండలాలకు చెందిన 95 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 51.25 లక్షల విలువ గల సీఎం సహా యనిధి చెక్కులను జడ్పీ చైర్‌ పర్సన్‌ వసంత, ఎమ్మెల్యే సంజయ్‌ కుమా ర్‌ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుం దని వివరించారు. గతంలో ఏ ప్రభుత్వాలు ఇంత పెద్ద మొత్తంలో సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించలేదని కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే నిరుపేదలకు అండగా నిలిచి ఆదుకుందని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో  వైస్‌ చైర్మన్‌ గోళి శ్రీనివాస్‌, పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్‌, రూరల్‌ అధ్యక్షుడు బాల ముకుందం, పీఏసీఎస్‌ చైర్మన్‌ సం దీప్‌రావు, రూరల్‌ ఇంచార్జి ఎంపీపీ రాజేంద్రప్రసాద్‌తో పాటు సర్పంచు లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు.


Read more