కొండగట్టులో అస్త్యవ్యస్తం..

ABN , First Publish Date - 2022-11-25T00:28:26+05:30 IST

పాలకవర్గం-అధికారుల మధ్య సమన్వయ లోపం భక్తులను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తోంది. ప్రణాళికాబద్ధంగా లేని చర్యలు పరిపాలనను అస్తవ్యస్తం చేస్తున్నాయి.

కొండగట్టులో అస్త్యవ్యస్తం..

మల్యాల, నవంబరు 24: పాలకవర్గం-అధికారుల మధ్య సమన్వయ లోపం భక్తులను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తోంది. ప్రణాళికాబద్ధంగా లేని చర్యలు పరిపాలనను అస్తవ్యస్తం చేస్తున్నాయి. నిత్యం వేలాది భక్తు లతో కోలాహలంగా ఉండే పుణ్యక్షేత్రం పరిధిలో అభివృద్ధి దేవుడెరుగు. సమస్యలు మాత్రం నానాటికీ పెరుగుతున్నా పట్టించుకునే వారే కరువ య్యారు. ఇదంతా కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం పరిధిలో కొ న్నాళ్లుగా నెలకొన్న పరిస్థితులు. కొండగట్టు దేవస్థానం పరిధిలో 8నెలల క్రితం పాలకవర్గం దాని తరువాత కొన్నాళ్లకు ఫౌండర్‌ట్రస్టీ నియామకం జరిగింది. అయితే పాలకవర్గం దేవస్థానం అధికారుల మధ్య నెలకొన్న సమన్వయ లోపం అభివృద్ధికి విఘాతంగా మారిందనే అభిప్రాయాలు వె ల్లువెత్తుతున్నాయి. పాలకవర్గం సూచించిన అభివృద్ధి కార్యక్రమాలు, భక్తు ల సౌకర్యాలు తదితరవి అధికారులు పరిగణలోకి తీసుకోకపోవడంతో వా రంతా గుర్రుగా ఉన్నారు. క్రమం తప్పకుండా కనీసం సమావేశాలు నిర్వ హించకుండా తమ ప్రతిపాదనలను పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తిన ట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాము పదవి చేపట్టిన నుంచి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడం, అధికారులు సహకరిం చకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగని అధికారులు చేసిం దేమి లేదని ప్రతీ దానికి కొర్రీలు పెడుతూ అడ్డుకుంటున్నారని దేవస్థానం పరిధిలో నిధుల గోల్‌మాల్‌, అవినితి పెరిగిపోయిందని ఆవేదన్య వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం కొండగట్టుకు వచ్చిన అడిషనల్‌ కమిషన ర్‌ జ్యోతికి కొండగట్టులో నెలకొన్న సమస్యలను ఏకరువు పెట్టారు. దేవ స్థానం అధికారుల తీరుపై అనేక ఫిర్యాదులు చేశారు. అధికారుల తీరుతో కొండగట్టు అస్తవ్యస్తంగా మారిందని ప్రక్షాళన చేయాలని కోరారు. ఈ వి షయమై ఆలయ ఈవో వెంకటేశ్‌ను సంప్రదించగా తాను బిజీగా ఉన్నం దున మళ్లీ ఫోన్‌ చేస్తానని కట్‌ చేయడం గమనార్హం.

కమిషనర్‌ దృష్టికి సమస్యలు

కొండగట్టులో నెలకొన్న సమస్యలను దేవస్థానం ఎఫ్‌.టీ ఇటీవల దేవా దాయ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు-పాలకవర్గం మధ్య నెల కొన్న సమన్వయ లోపంపై వివరించారు. అభివృద్ధి పనుల తీర్మానాలు, నూతనంగా తీసుకువచ్చే పూజా కార్యక్రమాలు, వెండి, రాగి లాకెట్‌ విక్ర యాలు, టెండర్లు ఇతరాత్ర అమలు చేయాల్సిన అనేక విషయాలను క మిషనర్‌కు తెలిపారు. దేవస్థానం తరుపున చేపట్టబోయే కార్యక్రమాల ప్రతిపాదనలు పంపడంపై జరుగుతున్న జాప్యం, పాలనపరంగా ఎదు ర్కొంటున్న సమస్యలు తీసుకోవాల్సిన చర్యలపై కమిషనర్‌కు ఓ లేఖ రాశా రు. కమిషనర్‌ చొరవ తీసుకొని తగు చర్యలు తీసుకొని ఎఫ్‌.టీ, పాలక వర్గం, ఈవోకు తగు మార్గదర్శకం చేయాలని పలువురు పేర్కొంటున్నారు.

అధికారుల విచారణ

కొండగట్టు దేవస్థానం పరిధిలో ఇటీవల ఆదాయం పెరుగుతుండగా.. ఎలాంటి అభివృద్ధి, సౌకర్యాలు కల్పించకుండానే వ్యయం కూడా అదేస్థా యిలో పెరుగుతండడంపై వచ్చిన అనుమానాలు, ఇతరాత్రా నేపథ్యంలో బుధవారం అడిషనల్‌ కమిషనర్‌ జ్యోతి ఫైళ్లను పరిశీలించారు. బడ్జెట్‌ ప్ర తిపాదనలు, ఖర్చు చేసిన విధానంపై విభాగాల వారిగా తనిఖీ చేశారు. ఫైళ్ల పరిశీలన సందర్భంగా అధికారుల ప్రశ్నలకు దేవస్థానం అధికారులు జవాబులు ఇవ్వకుండా మౌనంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో ఫైళ్లను పరి శీలించిన అధికారులు నివేధికను కమిషనర్‌కు అప్పగించనున్నట్లు సమా చారం. కొన్నాళ్ల క్రితం దేవస్థానం పరిధిలో నిధుల అవకతవకలు, అడిట్‌ అభ్యంతరాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నెల 29న కొండగట్టులో విచారణ జరుగనుంది. ఇందుకు గాను విచారణ అధికారిగా వేములావాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఈవో కృష్ణప్రసాద్‌ను కమిషనర్‌ నియమించారు

Updated Date - 2022-11-25T00:28:26+05:30 IST

Read more