చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-09-27T06:09:36+05:30 IST

వెనుకబడిన తరగతుల ప్రజల హక్కుల కోసం పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని, ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు.

చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేయాలి
కోరుట్లలో నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు తదితరులు

జగిత్యాల టౌన్‌, సెప్టెంబరు 26: వెనుకబడిన తరగతుల ప్రజల హక్కుల కోసం పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని, ఆమె  ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్‌ బండ్‌ వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహం ఎదుట జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ, బల్దియా చైర్‌ పర్సన్లు దావ వసం త, బోగ శ్రావణి, గ్రంఽథాలయ సంస్థ చైర్మన్‌ గొల్లపెల్లి చంధ్రశేఖర్‌ గౌడ్‌లతో కలిసి ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్లు బీఎస్‌ లత, అరుణశ్రీ, బీసీ సంక్షేమాధికారి సాయి బాబా, వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి రవీం దర్‌రెడ్డి, కౌన్సిలర్లు బాలెలత, పంబాల రాము, శ్రీకాంత్‌, పద్మ ఉన్నారు.

ఫ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీర, ధీర వనిత నిజమైన తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మ అని పట్టభ ధ్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని చింతకుంట చెరువు వద్ద ఉన్న ఐలమ్మ విగ్రహం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో ఫ్లోర్‌లీడర్‌ కల్లెపెల్లి దుర్గయ్య, నాయకులు అల్లాల రమేష్‌రావు, నక్క జీవన్‌, రెపల్లె హరికృష్ణ, గుండ మధు తదితరులు ఉన్నారు.  

ఫ మెట్‌పల్లి: పట్టణంలోని పాత బస్టాండు వద్ద గల చాకలి అయిలమ్మ విగ్రహం వద్ద  పలువురు రజక సంఘం, బీజేపీ నాయకులు, తెలంగాణ జన సమితి నాయకులు  ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పలువురు రజక సంఘ నాయకులు, బీజేపీ, బీజేవైయం, తెలంగాణ జన సమితి నాయకులు పాల్గొన్నారు.

ఫ కోరుట్ల: పట్టణంలోని పాత మున్సిపల్‌ వద్ద ఐలమ్మ విగ్రహానికి కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్య క్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నం లావణ్య - అనిల్‌, ఎంపీపీ తోట నారాయణ, కౌన్సిలర్లు గుండోజీ శ్రీనివాస్‌, జిందం లక్ష్మినారాయణ, సజ్జు, గందం గంగాధర్‌ మార్కెట్‌ కమిటి మాజీ వైస్‌ చైర్మెన్‌ మోహన్‌ రెడ్డి నాయకులు గుగ్గిళ్ల సరేష్‌ గౌడ్‌, బాబ, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-27T06:09:36+05:30 IST