నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలది కీలక పాత్ర

ABN , First Publish Date - 2022-12-06T23:15:22+05:30 IST

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషి స్తున్నాయని పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌రెడ్డి, సీపీ చంద్ర శేఖర్‌రెడ్డి అన్నారు.

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలది కీలక పాత్ర

కోల్‌సిటీ, డిసెంబరు 6: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషి స్తున్నాయని పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌రెడ్డి, సీపీ చంద్ర శేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం గౌతమినగర్‌లో ఎఫ్‌సీఐ ఎంప్లాయీస్‌ కోఆపరేటి వ్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 50 సీసీ కెమెరాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే సీసీ కెమెరాల ఏర్పాటులో తెలంగా ణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. సీసీ కెమెరాల ద్వారా ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చన్నారు. ఏ చిన్న సంఘటన జరిగినా తెలుసుకోవచ్చని, సీసీ కెమె రాలు 24గంటలు ప్రజలకు రక్షణగా నిలుస్తాయని చెప్పారు. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి దొంగతనాలకు, నేరాలకు పాల్పడేవారని, ప్రస్తుత పరిస్థితుల్లో సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాల్లో నేరాలు, దొంగతనాలు చేయడానికి నేరస్థులు భయపడుతున్నారని చెప్పారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లలో సీసీ కెమెరాల ద్వారా ఎన్నో కీలకమైన కేసులను చేధించామన్నారు. ఎఫ్‌సీఐ ఎంప్లాయీస్‌ కోఆపరేటివ్‌ సొసైటీ సభ్యులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీ పీ గిరి ప్రసాద్‌, రామగుండం ఇన్‌చార్జి ముత్తి లింగయ్య, ఎస్‌ఐ జీవన్‌, అంతర్గాం ఎస్‌ఐ సంతోష్‌, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:15:25+05:30 IST