నేరపరిశోధనలో సీసీ కెమెరాలు కీలకం

ABN , First Publish Date - 2022-02-23T06:44:02+05:30 IST

నేరపరిశోధనలో సీసీ కెమెరాలు అత్యంత కీలకంగా పనిచేస్తాయని ఎస్పీ రాహుల్‌ హెగ్డే అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు, మున్సిపల్‌, టీ-ఫైబర్‌ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు.

నేరపరిశోధనలో సీసీ కెమెరాలు కీలకం
మాట్లాడుతున్న ఎస్పీ రాహుల్‌హెగ్డే

- కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం

- ఎస్పీ రాహుల్‌ హెగ్డే

సిరిసిల్ల క్రైం, ఫిబ్రవరి 22: నేరపరిశోధనలో సీసీ కెమెరాలు  అత్యంత కీలకంగా పనిచేస్తాయని ఎస్పీ రాహుల్‌ హెగ్డే అన్నారు.  సీసీ కెమెరాల ఏర్పాటుపై మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు, మున్సిపల్‌, టీ-ఫైబర్‌ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు.  సీసీ కెమెరాల పర్యవేక్షణ కోసం ఆధునాతన కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేయనున్నట్లు చెప్పారు.  జిల్లాలో ‘నేను సైతం’, ‘కమ్యూనిటీ పోలిసింగ్‌’లో భాగంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన  సీసీ కెమెరాలను పోలీస్‌స్టేషన్‌, సర్కిల్‌ కార్యాలయం, సబ్‌ పోలీస్‌ డివిజన్‌ నుంచి జిల్లా కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. టీ-ఫైబర్‌, మున్సిపల్‌, సెస్‌ అధికారుల సమన్వయంతో చేపట్టాలన్నారు.   ఏ ప్రాంతంలోనైనా ట్రాఫిక్‌ సమస్య తలెత్తితే సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించడం ద్వారా సమస్యను వెంటనే పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. నేరాలను ఛేదించే వీలుందన్నారు. కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని మానిటర్‌ చేయడానికి అవసరమైన సాంకేతిక సిబ్బంది అందుబాటులో ఉండి సమాచారాన్ని సంబంధిత అధికారులకు చేరవేస్తారన్నారు.  అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు చంద్రశేఖర్‌, చంద్రకాంత్‌, రవికుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, సీఐలు అనిల్‌కుమార్‌, ఉపేందర్‌, వెంకటేశ్‌, బన్సీలాల్‌, శ్రీలత, మొగిలి, టీ-ఫైబర్‌ మేనేజర్‌ సతీష్‌, జోనల్‌ మేనేజర్‌ రాజేందర్‌, శేఖర్‌, అనిల్‌, ఎస్సైలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-23T06:44:02+05:30 IST