జీప్యాట్‌, నైపర్‌ ర్యాంకర్లకు నగదు పురస్కారం

ABN , First Publish Date - 2022-09-08T07:23:00+05:30 IST

శాతవాహన విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాలో బీఫార్మసీ చదివి జీప్యాట్‌, నైపర్‌ పరీక్షల్లో 500లోపు ర్యాంకు సాధించిన విద్యార్థులకు విశ్వవిద్యాలయం తరపున వీసీ ప్రొఫెసర్‌ ఎస్‌ మల్లేశ్‌ బుధవారం నగదు పురస్కారాలను అందజేశారు.

జీప్యాట్‌, నైపర్‌ ర్యాంకర్లకు నగదు పురస్కారం
నగదు పురస్కారాలను అందజేస్తున్న వీసీ ప్రొఫెసర్‌ ఎస్‌ మల్లేశ్‌

గణేశ్‌నగర్‌, సెప్టెంబరు 7: శాతవాహన విశ్వవిద్యాలయం  ఫార్మసీ కళాశాలో బీఫార్మసీ చదివి జీప్యాట్‌, నైపర్‌ పరీక్షల్లో 500లోపు ర్యాంకు సాధించిన విద్యార్థులకు విశ్వవిద్యాలయం తరపున వీసీ ప్రొఫెసర్‌ ఎస్‌ మల్లేశ్‌ బుధవారం నగదు పురస్కారాలను అందజేశారు. 2018-22 బ్యాచ్‌కు చెందిన బీ ఫార్మసీ విద్యార్థులు కె లాస్యప్రియ, బి సౌమ్య భవానీ, కె లక్ష్మీనాగ సంధ్య, డి రాజ్యలక్ష్మి, బి భావన ఒక్కొక్కరికికి 10 వేల రూపాయల చొప్పున నగదు రివార్డులను  అందజేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ఈ ప్రోత్సాహకాన్ని అందజేస్తున్నామన్నారు. రాబోయే బ్యాచ్‌ల విద్యార్థులు మరింత కష్టపడి ఉత్తమ ర్యాంకులు సాధించాలని, విశ్వవిద్యాలయానికి పేరుకు తీసుకురాన్నారు. కార్యక్రమంలో రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ ఎం వరప్రసాద్‌, అసిస్టెంట్‌ రిజిస్ర్టార్‌ వై కిషోర్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-08T07:23:00+05:30 IST