Karimnagar.. రాజన్న సిరిసిల్ల: భారీ వర్షానికి వాగులో కొట్టుకుపోయిన కారు..

ABN , First Publish Date - 2022-09-11T15:42:34+05:30 IST

భారీ వర్షాలకు (Heavy Rains) పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి.

Karimnagar.. రాజన్న సిరిసిల్ల: భారీ వర్షానికి వాగులో కొట్టుకుపోయిన కారు..

రాజన్న సిరిసిల్ల (Rajanna Sirisilla): భారీ వర్షాలకు (Heavy Rains) పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. తాజాగా వేములవాడ మండలం, ఫాజుల్ నగర్ దగ్గర ప్రమాదం జరిగింది. భారీ వర్షానికి కారు (Car) వాగులో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరు సురక్షితంగా బయటకు వచ్చారు. జేసీబీ సహాయంతో పోలీసులు కారును బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.


కాగా తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. 

Read more