కేబుల్‌ బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-10-04T06:38:34+05:30 IST

కరీంనగర్‌లోని కేబుల్‌ బ్రిడ్జి అప్రోచ్‌ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు.

కేబుల్‌ బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలి
నమూనాను పరిశీలిస్తున్న ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శ్రీనివాసరావు

రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శ్రీనివాసరావు

కరీంనగర్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగర్‌లోని కేబుల్‌ బ్రిడ్జి అప్రోచ్‌ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. సోమ వారం కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, ఆర్‌అండ్‌బి అధికారులతో కలిసి కలెక్టరేట్‌ నూతన భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం తీగల వంతెన అప్రోచ్‌ రోడ్డు నిర్మాణ పను లను పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌, అధికారు లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అం డ్‌బీ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ గణపతిరెడ్డి, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ సాంబశివరావు, కాంట్రాక్టర్లు, ఆర్‌అండ్‌బీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Read more