శిలా ఫలకం ఎదుట బీజేపీ నిరసన

ABN , First Publish Date - 2022-04-10T06:33:35+05:30 IST

మండలంలోని బతికెపెల్లి గ్రామంలో బీజేపీ మండలశాఖ ఆధ్వర్యంలో శిలా ఫలకం ముందు వినూత్న నిరసన చేప ట్టారు.

శిలా ఫలకం ఎదుట బీజేపీ నిరసన
నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు

పెగడపల్లి, ఏప్రిల్‌ 9 : మండలంలోని బతికెపెల్లి గ్రామంలో బీజేపీ మండలశాఖ ఆధ్వర్యంలో శిలా ఫలకం ముందు వినూత్న నిరసన చేప ట్టారు. నాలుగు సంవత్సరాల క్రితం మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చీఫ్‌విప్‌ హోదాలో బతికెపెల్లి గ్రామంలో రూ.20 లక్షల అంచనా వ్యయంతో నా లుగు చోట్ల సీసీ రోడ్ల నిర్మాణానికి ఆర్భాటంగా శంకుస్థాపన చేసి ప నులు చేయకుండా వదిలి వేయడంతో శిలాఫలకానికి పూల దండ వే సి, మద్యం, మాంసాహారం, బీడీలు, పూలు, పళ్లు పెట్టి నాలుగేళ్ల సం వత్సరీకం పెట్టి వినూత్నంగా నిరసన చేపట్టారు. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యం మాట్లాడుతూ త్వరలో ధర్మపురి నియోజక వర్గంలోని అన్ని గ్రామాలలో శంకు స్థాపనలు చేసి పనులు చేపట్టకుం డా పెండింగ్‌లో ఉన్న శిలా ఫలకాలకు వివిధ రూపాల్లో నిరసనలు చే పడతామని తెలిపారు. బీజేపీ మండల అధ్యక్షుడు గంగుల కొమురెల్లి, జిల్లా కార్యవర్గ సభ్యుడు కొత్తూరి బాబు, పెంట నరేంధర్‌, గంగాధర్‌, కిషోర్‌, రాము, కైలాసం, రమేష్‌, మల్లేశం, రాజేశం పాల్గొన్నారు.


Read more