చెవిలో పూలతో బీజేపీ నాయకుల నిరసన

ABN , First Publish Date - 2022-09-17T05:49:11+05:30 IST

ప్రభుత్వ ఆసుపత్రి స్థాయిని పెంచాలంటూ బీజేపీ మండల అధ్యక్షుడు బెంద్రం తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో చెవిలో పూలతో నిరసన వ్యక్తం చేశారు.

చెవిలో పూలతో బీజేపీ నాయకుల నిరసన
నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులు

ఇల్లంతకుంట, సెప్టెంబరు 16: ప్రభుత్వ ఆసుపత్రి స్థాయిని పెంచాలంటూ బీజేపీ మండల   అధ్యక్షుడు బెంద్రం తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో చెవిలో పూలతో నిరసన వ్యక్తం చేశారు. మండలకేంద్రంలోని బస్టాండ్‌ ప్రాంతంలో శుక్రవారం మంత్రి కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.   మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా ఆసుపత్రి స్థాయి పెరుగలేదన్నారు. ఉద్యమాలు చేస్తున్న బీజేపీ నాయకులపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు.  కార్యక్రమంలో నాయకులు గజ్జల శ్రీనివాస్‌, బొల్లారం ప్రసన్న, బోయిని రంజిత్‌, దండవేని రజనీకాంత్‌, నాగసముద్రాల సంతోష్‌, బండారి రాజు, స్వామి, మామిడి హరీష్‌, శ్రావణ్‌, శ్రీకాంత్‌, వేణు తదితరులు పాల్గొన్నారు.

Read more