ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న బీజేపీ

ABN , First Publish Date - 2022-12-12T00:38:49+05:30 IST

కరీంనగర్‌ టౌన్‌, డిసెంబరు 11: ప్రజలను తప్పుదారి పట్టిస్తూ కల్లబొల్లి మాటలతో మభ్య పెడుతున్న బీజేపీ పాదయాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసినా తెలంగాణ ప్రజలు విశ్వసించ రని మేయర్‌ యాదగిరి సునీల్‌రావు పేర్కొన్నారు.

ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న బీజేపీ
సమావేశంలో మాట్లాడుతున్న మేయర్ సునీల్‌రావు

కరీంనగర్‌ టౌన్‌, డిసెంబరు 11: ప్రజలను తప్పుదారి పట్టిస్తూ కల్లబొల్లి మాటలతో మభ్య పెడుతున్న బీజేపీ పాదయాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసినా తెలంగాణ ప్రజలు విశ్వసించ రని మేయర్‌ యాదగిరి సునీల్‌రావు పేర్కొన్నారు. ఆదివారం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లా డారు. టీఆర్‌ఎస్‌ నాయకులు బీజేపీలో చేరాలని పిలుపు ఇవ్వడం ఆ పార్టీ బలహీనతకు నిదర్శనమన్నారు. బండి సంజయ్‌ మాటల ద్వారా బీజేపీ ఆశావహులకు టికెట్లు రావని తేట తెల్లమైనందున పార్టీ నాయకులు గుర్తించాలని సూచించారు. బలమైన నాయకులు బీజేపీలో లేరని సంజయ్‌ మాటలతో అర్థమవుతోందని అన్నారు. పాదయాత్ర ద్వారా ఆ పార్టీకి ఆదరణ దక్కక పోవడం, బీఆర్‌ఎస్‌ నాయకులపై ప్రజలకున్న ఆదరణ, అభిమానాన్ని చూసి సంజయ్‌ నోట సత్యాలు మాట్లాడే ప్రయత్నం మొదటిసారిగా చేశారని అన్నారు. సంజయ్‌ మాటలు బీఆర్‌ఎస్‌ పార్టీని, కేసీఆర్‌ నాయకత్వ బలాన్ని గుర్తించి నట్లుగా ఉన్నాయని చెప్పారు.

ఇప్పటికే ఏ ఎన్నికలు జరిగినా ఇతర పార్టీ నుంచి నాయకులు తెచ్చి సీట్లు ఇచ్చే సంస్కృతి బీజేపీదని ఎద్దేవా చేశారు. 67 ఏళ్లు దేశాన్ని పాలించిన ప్రధాన మంత్రులు 60 లక్షల కోట్ల అప్పులు చేసి ఇండస్ట్రీలు, ప్రాజెక్టులను నిర్మించి యువతకు ఉద్యోగాలను కల్పిస్తే బీజేపీ నేతృత్వం లోని మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలోనే అదనంగా 100 లక్షల కోట్ల రూపాయలు అప్పుచేసి ఒక్కో భారతీయుడిపై సగటున ఐదు లక్షల అప్పుమోపిందని ఆరోపించారు. 100 లక్షల కోట్ల అప్పు చేసిన మోదీ సర్కార్‌ ఎక్కడ ఉపాధి అవకాశాలు కల్పించారని, ఎక్కడ ప్రాజెక్టులు కట్టారని, ఎక్కడ వ్యాపార సంస్థలు పెట్టారని నిలదీశారు. ఎంత మంది నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చారో సంజయ్‌ స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఉన్న సంస్థలను ప్రైవేట్‌ పరం చేసి అందులోని పని చేస్తున్న వారి ఉద్యోగాలు ఊడగొట్టారే తప్ప చేసిందేమీ లేదని ధ్వజ మెత్తారు. బడా వ్యాపారులకు 14 లక్షల కోట్ల రూపాయల రుణ బకాయిలను మాఫీ చేసిన ఘనత మోదీకే దక్కిందని, మేకిన్‌ ఇండియా అంటే అప్పు లు చేసి ప్రజలపై భారం మోపడమేనా అని ప్రశ్నించారు. మోదీ సర్కా ర్‌ ఆగడాలు దాగవని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని హెచ్చరించారు.

100 లక్షల కోట్ల అప్పుల నుంచి కరీంనగర్‌కు ఉపాధి హామీ మిన హా ఇతర ప్రత్యేకంగా నిధులు ఏం తెచ్చారో శ్వేతపత్రం విడుదల చేయా లని సంజయ్‌ని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల మందికి ఉద్యోగాలిస్తే బీజేపీ తొమ్మిదేళ్లలో దేశ వ్యాప్తంగా లక్ష ఉద్యోగాలిచ్చామని చెప్పడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. నిర్మాణాత్మకమైన అభివృద్ధి దిశగా బీజేపీ ప్రభుత్వం ముందుకు పోవ డం లేదని అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు దిండిగాల మహేశ్‌, కుర్ర తిరుపతి, గంట కల్యాణి, అర్ష మల్లేశం, వాల రమణ రావు, ఐలేందర్‌యాదవ్‌, నాయకులు పట్టల శ్రీనివాస్‌, కర్ర రాజశేఖర్‌, గందె మహేశ్‌, కరీం, ఉయ్యాల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T00:38:49+05:30 IST

Read more