భక్తులకు మెరుగైన సౌకర్యాలు

ABN , First Publish Date - 2022-09-29T06:05:32+05:30 IST

రాజరాజేశ్వరస్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి.కృష్ణప్రసాద్‌ అన్నారు.

భక్తులకు మెరుగైన సౌకర్యాలు
బాధ్యతలు స్వీకరిస్తున్న కృష్ణప్రసాద్‌

వేములవాడ, సెప్టెంబరు 28 : రాజరాజేశ్వరస్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని వేములవాడ  రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి.కృష్ణప్రసాద్‌ అన్నారు. ఆలయ ఈవోగా బుధవారం  బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇక్కడ ఈవోగా పనిచేసిన అనుభవంతో భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని, సామాన్య భక్తులకు తొలి ప్రాధాన్యం ఇస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఆయనను ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సంకేపల్లి హరికిషన్‌, ఏఈవోలు బ్రహ్మన్నగారి శ్రీనివాస్‌, ప్రతాప నవీన్‌, సూపరింటెండెంట్లు సిరిగిరి శ్రీరాములు, గోలి శ్రీనివాస్‌, నాగుల మహేశ్‌, బి.తిరుపతిరావు, హరిహరనాథ్‌, సిబ్బంది పెరుక శ్రీనివాస్‌, ఎడ్ల శివ, శ్యాం, అకౌంట్స్‌ అడ్వయిజర్‌ ఆగమరావు, ఎస్పీఎఫ్‌ సిబ్బంది సన్మానించారు. 

Read more