సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-06-12T05:51:15+05:30 IST

సైబర్‌ నేరాలపై అప్ర మత్తంగా ఉండాలని సీఐ ప్రదీప్‌కుమార్‌ తెలిపారు.

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
సమావేశంలో మాట్లాడుతున్న సీఐ ప్రదీప్‌

- సీఐ ప్రదీప్‌కుమార్‌

పెద్దపల్లి టౌన్‌, జూన్‌ 11 : సైబర్‌ నేరాలపై అప్ర మత్తంగా ఉండాలని సీఐ ప్రదీప్‌కుమార్‌ తెలిపారు. పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలోని చందపల్లిలో శని వారం సైబర్‌ సురక్షత, జాతీయ భద్రత అనే అంశం పై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భం గా సీఐ ప్రదీప్‌కుమార్‌ మాట్లాడుతూ ఆండ్రాయిడ్‌ ఫోన్లు వాడేవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి అవ సరముందన్నారు. సోషల్‌ మీడియా నుంచి చొరబడే సైబర్‌ నేరగాళ్లు సెల్‌ నంబర్‌ను హ్యాక్‌ చేసి సెల్‌ఫోన్లో ఉన్న సమాచారాన్ని సేకరించి వాటిని అసభ్యకర రీతి లో మార్ఫింగ్‌ చేసి కుటుంబ సభ్యులకు, మిత్రులకు పంపిస్తామని బెదిరింపు కాల్స్‌ చేస్తారని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి కేసులు చాలా నమోదవు తున్నాయని వివరించారు. పార్ట్‌ టైం జాబ్‌ ఇస్తామని, లాటరీ వచ్చిందని, లోన్లు ఇప్పిస్తామని మిమ్మల్ని ము గ్గులోకి లాగి, మీ పూర్తి వివరాలు సేకరిస్తారన్నారు. ఎవరికి కేవైసీ నంబర్‌, క్రెడిట్‌ కార్డు, ఏటీఎమ్‌ కార్డు వివరాలు ఇవ్వద్దని సూచిం చారు. మిమ్మల్ని బెరింపులకు గురిచేసి డబ్బులు గుంజుతారన్నారు. సైబర్‌ నేరగాళ్ళ ఉచ్చులో పడకుండా అతి జాగ్రత్తగా సెల్‌ ఫోన్‌ వినియోగించుకోవాలన్నారు. ఏలాంటి నజరానాలకు లొంగిపోకుండా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సైబర్‌ నేరస్థులను పట్టుకోవడం చాలా కష్టతరంగా మారిందని, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాల ని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు రాజేష్‌ లున్నారు. 

Updated Date - 2022-06-12T05:51:15+05:30 IST