అమ్మాయిల పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి

ABN , First Publish Date - 2022-10-11T05:32:47+05:30 IST

అమ్మాయిలపట్ల ప్రతీ ఒక్కరు బాధ్యతాయు తంగా ప్రవర్తించాలని చైల్డ్‌ హెల్ప్‌లౌన్‌ 1098 జిల్లా కో ఆర్డినేటర్‌ కడారి శ్రావణ్‌ కోరారు.

అమ్మాయిల పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి
టోల్‌ఫ్రీ నంబర్‌ ఆకారంలో విద్యార్థులు

చైల్డ్‌ హెల్ప్‌లౌన్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ కడారి శ్రావణ్‌

వెల్గటూర్‌, అక్టోబరు 10: అమ్మాయిలపట్ల ప్రతీ ఒక్కరు బాధ్యతాయు తంగా ప్రవర్తించాలని చైల్డ్‌ హెల్ప్‌లౌన్‌ 1098 జిల్లా కో ఆర్డినేటర్‌ కడారి శ్రావణ్‌ కోరారు. సోమవారం వెల్గటూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల లో అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు బాలల హక్కులపై అవగా హన కల్పించారు. యువర్‌ టైం యువర్‌ ఫ్యూచర్‌ అనే అంశంపై విద్యా ర్థులకు వివరించారు. బాల్య వివాహాలు చేయవద్దని 18 ఏళక్షౌ నిండిన త రువాతనే బాలికలకు వివాహం చేయాలని, లేని పక్షంలో వారికి శారీరక సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. పోక్సో చట్టం-2012, జేజే చట్టం- 2015, బాల్య వివాహ నిషేధ చట్టం- 2006 మొదలగు చట్టాపై అవగా హన కల్పించారు. ఆడపిల్లలను ఎవరైనా వేధిస్తే 1098 నంబరుకు ఫోన్‌ చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు ని ర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, చైల్డ్‌ టీం సభ్యు డు రాజేశం పాల్గొన్నారు.

కథలాపూర్‌: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సో మవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సం దర్భంగా ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ రాధిక మాట్లాడుతూ బాలికల పట్ల వి వక్ష చూపకూడదని, 18 ఏళ్లు పైబడిన అనంతరమే బాలికలకు వివా హం చేయాలని పేర్కొన్నారు. బాలికలకు ఏదైనా సమస్య ఎదురై నప్పుడు 1098 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు. 1098 ఆకృతిలో విద్యార్థులు ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం అర్జున్‌, వనత డుపుల రవికుమార్‌, వెంకటేశం, వెంకటస్వామి ఉన్నారు.

Updated Date - 2022-10-11T05:32:47+05:30 IST