పూలను దేవతగా కొలిచే పండుగ బతుకమ్మ

ABN , First Publish Date - 2022-09-27T06:06:15+05:30 IST

పూలను దేవతగా కొలిచే పండుగ బతుకమ్మ అని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

పూలను దేవతగా కొలిచే పండుగ బతుకమ్మ
జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో బతుకమ్మ ఆడుతున్న ఎమ్మెల్సీ కవిత

  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

జగిత్యాల, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): పూలను దేవతగా కొలిచే పండుగ బతుకమ్మ అని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు,  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం జిల్లాలోని మెట్‌పల్లి పట్టణంలోని మినీ స్టేడియంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. పలువురు మహిళలతో కలిసి బతుకమ్మ ఆటలు ఆడారు. బతుకమ్మను నెత్తిపై ఎత్తుకొని ప్రదర్శన జరిపారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమా వేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. బతుకమ్మ పండుగ అంటేనే మహిళలు సంతోష పడుతారన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పువ్వుల సేకరణతో పాటు సాయంకాలం వేళల్లో పాటలు పాడటం, ఆటలు ఆడడం వంటివి వాడవాడనా చేస్తారన్నారు. తల్లిగారింటికి వెళ్లి బతుకమ్మ ఆడడం ఆనవాయితీగా వస్తుందన్నారు. మన పండుగను మనం మరింత కాపాడుకునే విధంగా బతుకమ్మ వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. బతుకమ్మ పండుగ వచ్చిందటే చిన్నారులు, బాలి కలు సైతం సంప్రదాయబద్దంగా దుస్తులను అలంకరించుకొని బతుకమ్మ ఆడుతున్నారన్నారు. సమాజంలోని అన్ని వర్గాల మహిళలు బతుకమ్మ ఆటలు ఆడుతుండడం ప్రత్యేకతను సంతరించుకుంటుందన్నారు. మహి ళలు బతుకమ్మను ఆడుతుంటారని, ఆటలు, పాటల్లో కష్టాలు మరిచి పోతారన్నారు. ఎన్నటికీ చెదిరిపోని విధంగా చాలా సంతోషంగా బతు కమ్మ పండును మహిళలు జరుపుకుంటారన్నారు. వందల సంవత్సరాల నుంచి బతుకమ్మ వేడుకల్లో పర్యావరణాన్ని రక్షించే విధంగా పూలను వినియోగిస్తున్నారన్నారు. మహిళలు పర్యావరణాన్ని చెప్పకనే బతుకమ్మ వేడుకల సందర్భంగా చెబుతారన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసిన చెరువులు నిండుకున్నాయని, బతుకమ్మ వేడుకల నిర్వహణకు ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేస్తున్నారన్నారు. గర్వంగా సంతోషంగా బతుకమ్మ ఆడుకునే పరిస్థితి ప్రస్తుతం వచ్చిందన్నారు. 

ప్రపంచ దేశాలకు బతుకమ్మ ప్రాధాన్యం

- ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు

ప్రపంచ దేశాలకు బతుకమ్మ ప్రాధాన్యం వివరించిన ఘనత కల్వకుం ట్ల కవితకు దక్కుతుందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. తెలంగాణ పండుగలకు ప్రాధాన్యతనిచ్చేలా ఎమ్మెల్సీ కవిత వ్యవహరిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రజల మనిషిగా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ సంప్రదాయ పండుగలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నారన్నారు.  

బతుకమ్మకు ఖ్యాతి తెచ్చిన ఘనత కవితదే

- జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత సురేశ్‌

బతుకమ్మకు ఖండాంతర ఖ్యాతి తెచ్చిన ఘనత కల్వకుంట్ల కవితదేనని జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత సురేశ్‌ అన్నారు. ప్రస్తుతం పలు దేశాల్లో బతుకమ్మ ఆటలు ఆడుతున్నారంటే అందుకు కల్వకుంట్ల కవితనే కారణమన్నారు. సమైఖ్య ఆంధ్రప్రదేశ్‌లో ప్రాధాన్యతను కోల్పో యిన తెలంగాణ పండుగలకు మన రాష్ట్రంలో జీవం వచ్చిందన్నారు. 

Read more