ఆడపడుచులకు సర్కారు కానుక బతుకమ్మ చీరలు

ABN , First Publish Date - 2022-09-21T05:39:39+05:30 IST

బతుకమ్మ పండుగకు కానుకగా రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ఆడపడుచులకు సిరిసిల్లలో తయారు చేసిన చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నట్లు సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందంకళాచక్రపాణి తెలిపారు.

ఆడపడుచులకు సర్కారు కానుక బతుకమ్మ చీరలు
మాట్లాడుతున్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

సిరిసిల్లరూరల్‌, సెప్టెంబరు 20 : బతుకమ్మ పండుగకు కానుకగా రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ఆడపడుచులకు సిరిసిల్లలో తయారు చేసిన చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నట్లు  సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందంకళాచక్రపాణి తెలిపారు. సిరిసిల్ల  మున్సిపల్‌ పరిధిలోని 24వ వార్డు రాజీవ్‌నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో మంగళవారం సీనియర్‌ నాయకుడు చీటి నర్సింగరావు, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య,  కౌన్సిలర్‌ బుర్ర లక్ష్మీశంకరయ్యతో  కలిసి  మహిళలకు బతుకమ్మ చీరలను  పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని అన్ని వార్డుల్లో బతుకమ్మ చీరల పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, కౌన్సిలర్లు పత్తిపాక పద్మ, దిడ్డి మాధవి,  కల్లూరి రాజు, ఆకుల కృష్ణ, అన్నారం శ్రీనివాస్‌, కో-ఆప్షన్‌ సభ్యుడు గొల్లపల్లి బాలయ్యగౌడ్‌, మాజీ ఎంపీటీసీ బుర్ర మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read more