తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుక

ABN , First Publish Date - 2022-09-26T06:21:49+05:30 IST

తెలంగాణ ఆడపడు చులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ బతుకమ్మ పండుగ కాను కగా చీరలను అందిస్తున్నారని పవర్‌లూం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌ అన్నారు

తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుక
సిరిసిల్లలో బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభిస్తున్న ప్రవీణ్‌

సిరిసిల్ల టౌన్‌, సెప్టెంబరు 25: తెలంగాణ ఆడపడు చులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ బతుకమ్మ పండుగ కాను కగా చీరలను అందిస్తున్నారని పవర్‌లూం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌ అన్నారు. ఆదివారం సిరిసిల్ల పట్టణం 5వ వార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో బతకమ్మ చీరల పంపిణీని ప్రవీణ్‌, కౌన్సిలర్‌ ధార్నం అరుణాలక్ష్మినారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌ మాట్లాడుతూ సిరిసిల్ల నేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలతో పని కల్పించి ఆత్మహత్యలు, ఆకలి చావులను నిలవరించిందన్నారు. ఏటా తెలంగాణ ఆడపడుచులకు కోట్ల రూపాయల ఆర్డర్లతో బతకమ్మ చీరలను పంపిణీ చేస్తోందన్నారు.  15వ వార్డులో కౌన్సిలర్‌ ఆకునూరి విజయనిర్మలబాలరాజు, 21వ వార్డులో కౌన్సిలర్‌  వేముల రవి బతకమ్మ చీరలను పంపిణీ చేశారు. 25వ వార్డులో కౌన్సిలర్‌ కుడిక్యాల రవికుమార్‌, 29వ వార్డులో కౌన్సిలర్‌ గెంట్యాల శ్రీనివాస్‌, 30వ వార్డులో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, 32వ వార్డులో కౌన్సిలర్‌ సీమాబేగంఅక్రమ్‌, 33వ వార్డులో కౌన్సిలర్‌ గడ్డం లతభాస్కర్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ సలీం, సిరిసిల్ల అర్బన్‌ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ ధార్నం లక్ష్మినారాయణ, నాయకులు రామగిరి శ్రీనివాస్‌, సయిద్‌ఖాన్‌, జక్కని భాస్కర్‌, ఆర్‌పీలు, వార్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Read more