ఘనంగా బతుకమ్మ సంబరాలు

ABN , First Publish Date - 2022-10-05T06:07:12+05:30 IST

ఒక్కేసి.. పువ్వేసి.. చందమామ.. ఒక్క జాములాయే చందమామ..

ఘనంగా బతుకమ్మ సంబరాలు
బతుకమ్మ ఆడుతున్న మహిళలు

రాయికల్‌, అక్టోబరు 4: ఒక్కేసి.. పువ్వేసి.. చందమామ.. ఒక్క జాములాయే చందమామ.. రామ రామరామ ఉయ్యాలో... రామనే శ్రీ రామ ఉయ్యాలో అంటూ మహిళల పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. రాయికల్‌ పట్టణంలో మంగళవారం బతు కమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. రం గురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలతో వేలాదిగా తరలివచ్చిన మహిళ లు అటలు ఆడుతూ బతుకమ్మలు ఆడారు. చి న్నారులు, మహిళల కోలాటాల నృత్యాలు ఆక ట్టుకున్నాయి. 

మున్సిపల్‌ చైర్మన్‌ మోర హ న్మాండ్లు, వైస్‌ చైర్మన్‌ గండ్ర రమాదేవి, కమిషనర్‌ గంగుల సంతోష్‌కుమార్‌లు మహిళలతో కలిసి బతుక మ్మలు అడారు. అనంతరం స్థానిక పెద్ద చెరు వులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఎ లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుం డా ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీ సు లు బందోబస్తు చర్యలు చేపట్టారు.

Read more