దళిత, మైనార్టీలపై దాడులను అరికట్టాలి

ABN , First Publish Date - 2022-09-30T04:56:30+05:30 IST

దళితులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి ఐ కృష్ణ, ఈ నరేష్‌ అన్నారు.

దళిత, మైనార్టీలపై దాడులను అరికట్టాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఐ కృష్ణ

- సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణ

కళ్యాణ్‌నగర్‌, సెప్టెంబరు 29: దళితులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి ఐ కృష్ణ, ఈ నరేష్‌ అన్నారు. గురువారం సత్యశోధక సమాజ్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోదావ రిఖని ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ దేశంలో, రాళష్ట్రంలో దళితులపై రోజురోజుకు దాడులు పెరు గుతున్నాయన్నారు. మతోన్మాదం, కుల ఉన్మాదం పేరుపై దళితులపై, మైనార్టీలపై అగ్రవర్ణ దాడులు జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. మతోన్మా దం, కుల ఉన్మాదం అంతరించిపోవాలంటే అణగారిన ప్రజలందరూ ఐక్యంగా పోరా టాలు చేయాలని పిలుపునిచ్చారు. దళితులందరికి రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గ య్య, సమ్మయ్య, బాబు, మంగ, మొండయ్య, పరుశరాం, బిక్షపతి పాల్గొన్నారు. 

Read more