జాతీయస్థాయిలో రాష్ట్ర జట్లు సత్తా చాటాలి

ABN , First Publish Date - 2022-11-30T01:14:53+05:30 IST

రాష్ట్ర జూడో జట్లు జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చాటాలని జూడో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి అనంతరెడ్డి అన్నారు.

జాతీయస్థాయిలో రాష్ట్ర జట్లు సత్తా చాటాలి
అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలిస్తున్న అధికారులు

కరీంనగర్‌ స్పోర్ట్స్‌, నవంబరు 29: రాష్ట్ర జూడో జట్లు జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చాటాలని జూడో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి అనంతరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం రాష్ట్రస్థాయి జూనియర్స్‌ పురుషుల, మహిళల జూడో చాంపియన్‌షిప్‌ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పోటీల్లో భాగంగా తొలిరోజున క్రీడాకారుల వెయిట్‌ టెస్ట్‌తోపాటు సర్టిఫికెట్లు పరిశీలిస్తారని, 30న పోటీలు జరుగతాయన్నారు. పోటీలకు వివిధ జిల్లాల నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు హాజరయ్యారన్నారుకార్యక్రమంలో జూడో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, ఎల్‌వీ రమణ, సిలివేరి మహేందర్‌, రాజశేఖర్‌, రాజు, మనీషా, ఠాకూర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T01:14:53+05:30 IST

Read more