-
-
Home » Telangana » Karimnagar » Asaara pensions should be given to all those who are eligible-MRGS-Telangana
-
అర్హులందరికీ ‘ఆసరా’ పింఛన్లు ఇవ్వాలి
ABN , First Publish Date - 2022-10-01T05:13:56+05:30 IST
నాలుగేళ్లుగా ఎంతో మంది ఆసరా పెన్షన్ల కోసం చెప్పులు అరిగేలా తిరుగుతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు మంజూరు చేయడం లేదని సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి
కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 30: నాలుగేళ్లుగా ఎంతో మంది ఆసరా పెన్షన్ల కోసం చెప్పులు అరిగేలా తిరుగుతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు మంజూరు చేయడం లేదని సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం నగరంలో అర్హులైన వారందరికీ ఆసరా పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. నాయకులు సమద్ నవాబ్, గుండాటి శ్రీనివాస్‌రెడ్డి, రహమత్ హుస్సేన్, ఎండి.తాజ్, నిహాల్ అహ్మద్ తదితరులున్నారు.