కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-08-25T05:34:20+05:30 IST

కానిస్టేబుల్‌ పోస్టు భర్తీలో భాగంగా నిర్వహిస్తున్న ప్రిలిమినరీ రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తు న్నామని నోడ్‌ అధికారి, డీసీపీ అడ్మిన్‌ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు.

కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
మాట్లాడుతున్న అడ్మిన్‌ డీసీపీ అఖిల్‌ మహాజన్‌

- డీసీపీ అడ్మిన్‌ అఖిల్‌ మహాజన్‌

జ్యోతినగర్‌, ఆగస్టు 24 : కానిస్టేబుల్‌ పోస్టు భర్తీలో భాగంగా నిర్వహిస్తున్న ప్రిలిమినరీ రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తు న్నామని నోడ్‌ అధికారి, డీసీపీ అడ్మిన్‌ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నియమావళి ప్రకారం పెద్ద పల్లి జోన్‌ పరిధిలోని కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు, చీఫ్‌ కోఆర్డినేటర్లకు బుధవారం ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియం హాలు లో డీసీపీ రూపేష్‌తో కలిసి అడ్మిన్‌ డీసీపీ అఖిల్‌ మహాజన్‌ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అఖిల్‌ మహాజనర్‌ మాటాడుతూ కానిస్టేబుల్‌ నియా మకంలో భాగంగా హాజరవుతున్న అభ్యర్థులకు ఈనెల 28 జరిగే పరీక్షకు సంబంధించి పెద్దపల్లి జోన్‌ పరిధిలో 24 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష ఉంటుందని, ఎగ్జామ్‌ సెంటర్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సబంధిత అధికారులను ఆదేశించారు. అభ్యర్థులను గుర్తించేందుకు బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు వినియోగిస్తున్నామన్నారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికన్నా గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరన్నారు. పరీక్ష, నియామక ప్రక్రియ పారదర్శకంగా జరగుతుందని, అభ్యర్థులు దళారులను నమ్మి మోస పోవద్దని ఆయన సూచించారు. సమావేశంలో పెద్దపల్లి జోన్‌ రీజి నల్‌ కోఆర్డినేటర్లు జైరొద్దీన్‌, సుందర్‌రావు(ఏసీపీ, ఏఆర్‌), రామగుం డం, గోదావరిఖని వన్‌టౌన్‌, మంథని, పెద్దపల్లి సీఐలు కె.లక్ష్మీనారా యణ, రమేష్‌బాబు, సతీష్‌, ప్రదీప్‌కుమార్‌, ఆర్‌ఐలు మధుకర్‌, శ్రీధర్‌, విష్ణుప్రసాద్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 

Read more