టీఆర్‌ఎస్‌లో కార్యకర్తలకు తగిన గుర్తింపు

ABN , First Publish Date - 2022-01-23T05:43:06+05:30 IST

టీఆర్‌ఎస్‌ పార్టీలో కార్యకర్తలకు తగిన గుర్తిం పు లభిస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు.

టీఆర్‌ఎస్‌లో కార్యకర్తలకు తగిన గుర్తింపు
పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌

 రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

ధర్మపురి, జనవరి 22: టీఆర్‌ఎస్‌ పార్టీలో కార్యకర్తలకు తగిన గుర్తిం పు లభిస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ధర్మపురి మండలంలోని జైనా గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ లకు చెందిన కార్యకర్తలు, యువకులు, మహిళలు కరీంనగర్‌లోని మిని స్టర్‌ క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ విశ్వసనీ యత కలి గిన పార్టీకి, ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంలో యువత ముందు ఉం టుందని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను కార్యకర్తలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జైనా ఉపసర్పంచ్‌ మహేష్‌, టీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు రమేష్‌, వార్డు సభ్యులు రవీందర్‌, టీఆర్‌ఎస్‌ మహిళా నాయకురాలు భూలక్ష్మి పాల్గొన్నారు. 

Read more