పంట రుణాలు కోసం దరఖాస్తు చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-09-19T06:31:17+05:30 IST

రైతులు పంట రుణాలు కోసం దరఖాస్తు చే సుకోవాలని కరీంనగర్‌ డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి కోరారు.

పంట రుణాలు కోసం దరఖాస్తు చేసుకోవాలి
రైతులకు చెక్కు అందిస్తున్న ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి

కరీంనగర్‌ డీసీఎంఎస్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి

ధర్మపురి, సెప్టెంబరు 18: రైతులు పంట రుణాలు కోసం దరఖాస్తు చే సుకోవాలని కరీంనగర్‌ డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి కోరారు. ధ ర్మపురి పీఏసీఎస్‌ సర్వసభ్య సమావేశం ఆయన అధ్యక్షతన ఆదివారం ని ర్వహించారు. సంఘం ఆర్థిక లావాదేవీలు, 2021-2022 సంవత్సరానికి సం బంధించిన ఆడిట్‌ నివేదికల గురించి సభ్యులతో కలిసి చర్చించారు. అనం తరం ఆయన మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు దృష్ట్యా సంఘం పరిధిలో గల అన్ని గ్రామాల్లో ఎరువుల గోదాం నిర్మాణాలు చేప డుతామని తెలిపా రు. రైతులు పంట, దీర్ఘకాలిక రుణాలు కోసం పట్టాదారు పాసు పుస్తకాలు, పహానీ, 1బీ నమూనాలు తీసుక వచ్చి దరఖాస్తు చేసు కోవాలని ఆయన కోరారు. సంఘం పరిధిలో గల ఆరుగురు రైతులకు రూ 6,40,000 దీర్ఘకా లిక రుణాలు, ఇద్దరు చిరువ్యాపారులకు రూ 2,00,000 చెక్కులను ఆయన పంపిణీ చేశారు. పంట పెట్టుబడి, చిరు వ్యాపారాలు, పశువులు, వాహనా లు కొనుగోలు కోసం కూడ సొసైటీ ద్వారా రుణాలు అందించినట్లు ఆయన వివరించారు. రైతులు తక్కువ వడ్డీతో సొసైటీ ద్వారా పొందిన రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రైతుల సౌకర్యార్థం తాగు నీ టి కోసం కొనుగోలు చేసిన రెఫ్రిజిరేటర్‌ను ఆయన చేతుల మీదుగా ప్రారం భించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ సంగి సత్యమ్మ, ఎంపీ పీ ఎడ్ల చిట్టిబాబు, ధర్మపురి పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ షేర్ల రాజేశం, సీఈవో అయ్యోరు రాజేష్‌, పాలకవర్గ సభ్యులు పెరు మాండ్ల ఎల్లాగౌడ్‌, కుమ్మరి రవి, గుర్రాల పెద్దపోశం, నక్క రాజు, రత్న, నూర లక్ష్మి, జాజాల లక్ష్మి, అశోక్‌, సహకార దత్తత అధికారి రాములు, ఎంపీటీసీ సత్యం, పాల్గొన్నారు.  


Read more