అనీమియా ముక్త్‌ దిశగా జిల్లా

ABN , First Publish Date - 2022-11-17T00:00:50+05:30 IST

కరీంనగర్‌ను అనీమియా ముక్త్‌ జిల్లాగా తీర్చిదిద్దే అద్భుతమైన కార్యక్రమాలను నిర్వ హిస్తున్నామని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు.

అనీమియా ముక్త్‌ దిశగా జిల్లా
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

కరీంనగర్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగర్‌ను అనీమియా ముక్త్‌ జిల్లాగా తీర్చిదిద్దే అద్భుతమైన కార్యక్రమాలను నిర్వ హిస్తున్నామని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. బుధవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాయలంలో జరిగిన సమావేశంలో అడ్మినిస్ర్టేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ డాక్టర్‌ సుభోద్‌ బృందానికి జిల్లాలో గర్భిణులు, కిశోర బాలికల ఆరోగ్య పరిస్థితులు, వారికి అందిస్తున్న వైద్య సేవల గురించి కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 14 నుంచి 55 సంవత్సరాల్లోపుగల 2 లక్షల 28 వేల మందికి రక్తహీనత పరీక్షలను నిర్వహించామన్నారు. మహిళలకు ఆశా కార్యకర్త లతో ఏ షీల్డ్‌ టెస్ట్‌ కిట్‌ ద్వారా రక్తహీనత పరీక్షలు నిర్వహించి, రక్తహీనత గల వారికి మెడికల్‌, పారామెడికల్‌ సిబ్బందితో వైద్య సేవలను అందిస్తూ పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.

ముఖ్యంగా గర్భిణులకు ప్రసవం వరకు తరచూ రక్తహీనత పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందిస్తున్నామని తెలిపారు. హైరిస్క్‌ ఉన్నవారిని గుర్తించి మెరుగైన వైద్య సహాయం కోసం గైన కాలజిస్టు వద్దకు పంపిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని పీహెచ్‌సీలను హైరిస్క్‌ కేసులకు వైద్య సహాయం అందించేలా తీర్చిదిద్దామన్నారు. కౌమారదశ బాలికలకు నెలసరిపై వైద్య సిబ్బందితో అవగాహన కల్పించి, వారికి అవసరమైన మందులను అంది స్తున్నామని తెలిపారు. రక్తహీనత పై జిల్లాలో ఏ షీల్ట్‌ యాప్‌లో ఎప్పటిక ప్పుడు వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. ఆశాకార్యకర్తలు వారు నిర్వహించే కార్యక్రమాలను వివరించారు. అడినిస్ర్టేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ డాక్టర్‌ సుభోద్‌ మాట్లాడుతూ జిల్లాలో అనీమియా ముక్త్‌ కార్యక్రమం అమలులో అధికారుల పనితీరు అభినందనీయంగా ఉందని తెలిపారు. కార్యక్రమం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ జువైరియా, స్ర్తీ, శిశు, మహిళా, వయోవృద్ధుల సంక్షేమ అధికారి సబితాకుమారి, యూనిసెఫ్‌ ప్రాజెక్టు సమన్వయకర్త కిషన్‌స్వామి, హరికృష్ణ, డాక్టర్‌ ప్రియదర్శిని, రేష్మ, శిల్ప పాల్గొన్నారు.

మూడో రోజు రూ. 11.27 కోట్ల ఆదాయం

కరీంనగర్‌ టౌన్‌: తిమ్మాపూర్‌ మండలం నుస్తులాపూర్‌ గ్రామంలోని అంగారిక టౌన్‌షిప్‌లోని 178 ప్లాట్లను వేలం ద్వారా అమ్మామని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. బుధవారం కరీంనగర్‌ వాసర గార్డెన్‌లో మూడో రోజు అంగారిక టౌన్‌షిప్‌ ఫ్లాట్ల వేలంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ మూడో రోజు 60 ప్లాట్లను వేలం వేశామ న్నారు. వేలం ప్రక్రియ ఈ నెల 25 వరకు కొనసాగుతుందని తెలిపారు. బుధవారం ప్లాట్‌ నంబర్‌ 358 నుంచి 417 వరకు వేలం వేయగా 58 ప్లాట్లు అమ్ముడుపోయాయన్నారు. వేలంలో 11.21 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని, మూడు రోజుల్లో మొత్తం 178 ప్లాట్స్‌ వేలం వేయ గా 33.97 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. మూడో లరోజు అత్యధికం గా చదరపు గజానికి 11,800, అతి తక్కువగా 6,100 రూపాయల ధర పలికిందన్నారురు. గురువారం ప్లాట్‌ నంబర్‌ 418 నుంచి 477 వరకు 60 ప్లాట్స్‌కు వేలం నిర్వహిస్తామని తెలిపారు. డీడీలు 25వ తేదీ వరకు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్‌, జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌, జిల్లా పశు సంవర్దకశాఖ అధికారి నరేందర్‌, తహసీల్దార్లు శ్రీనివాస్‌, కనకయ్య, ఈ-డిస్ర్టిక్ట్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, ఏఈ చిరంజీవి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-17T00:00:50+05:30 IST

Read more