-
-
Home » Telangana » Karimnagar » Amma in Chandraghanta Alankaram-NGTS-Telangana
-
చంద్రఘంట అలంకారంలో అమ్మవారు
ABN , First Publish Date - 2022-09-29T06:04:43+05:30 IST
శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరీదేవి అమ్మవారు చంద్రఘంట అలంకారంలో బుధవారం భక్తులకు దర్శనమిచ్చారు.

వేములవాడ, సెప్టెంబరు 28 : శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరీదేవి అమ్మవారు చంద్రఘంట అలంకారంలో బుధవారం భక్తులకు దర్శనమిచ్చారు. వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో కొనసాగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూడో రోజు ఉదయం ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ నేతృత్వంలో అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి మహాభిషేకం నిర్వహించి చంద్రఘంట అవతారంలో అలంకరించారు. అనంతరం లలిత సహస్రనామ సహిత చతుష్షష్ట్యోపచార పూజ, శ్రీదేవి భాగవత పురాణం చేపట్టారు. నాగిరెడ్డి మండపంలో హోమం నిర్వహించారు. సాయంత్రం ప్రత్యేక పూజలు, కన్యకాసువాసినీ పూజ నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలందుకుంటున్న రాజరాజేశ్వరీ అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు.