మెడికల్‌ కళాశాలకు అదనపు నిధులు ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-10-03T05:56:26+05:30 IST

జిల్లాకు నూత నంగా మంజూరైన ప్రభుత్వ మెడికల్‌ కళాశాల అభివృద్ధికి అదనపు నిధులు మంజూరు చేయా లని కోరుతూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావుకు జగిత్యాల ఎమ్మె ల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ హైదరాబాద్‌లో ఆదివారం కలిసి వినతిపత్రం అందించారు.

మెడికల్‌ కళాశాలకు అదనపు నిధులు ఇవ్వాలి
మంత్రి హరీష్‌రావుతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

- మంత్రి హరీశ్‌ రావును కోరిన ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

జగిత్యాల, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు నూత నంగా మంజూరైన ప్రభుత్వ మెడికల్‌ కళాశాల అభివృద్ధికి అదనపు నిధులు మంజూరు చేయా లని కోరుతూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావుకు జగిత్యాల ఎమ్మె ల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ హైదరాబాద్‌లో ఆదివారం కలిసి వినతిపత్రం అందించారు. మెడికల్‌ కళాశాలకు అదనపు నిధులు మంజూరు చేయడంతో పాటు అధునిక వైద్య పరికరాలు అందివ్వాలని కోరారు. కంటి వైద్యానికి సంబం దించిన మైక్రోస్కోప్‌ పరికరాలు, ఆపరేషన్‌ థియేటర్‌ సమ కూర్చాలని కోరారు. సుమారు రూ. 20 లక్షలతో సింగిల్‌ డోనర్‌ ప్లేట్‌లెట్‌ మిషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించా యి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్‌ రాజేశం గౌడ్‌ పాల్గొన్నారు.


Read more