కార్యకర్తలు సమన్వయంతో ముందుకుసాగాలి

ABN , First Publish Date - 2022-11-25T00:11:23+05:30 IST

సమన్వయంతో ముందుకుసాగి కా ర్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ఉమార్‌ కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు.

కార్యకర్తలు సమన్వయంతో ముందుకుసాగాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌

ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌

జగిత్యాలరూరల్‌, నవంబరు 24 : సమన్వయంతో ముందుకుసాగి కా ర్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ఉమార్‌ కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. గురువారం టీఆర్‌ ఎస్‌పార్టీ కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జగిత్యాల అర్బ న్‌, రూరల్‌ మండల ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జడ్పీ చైర్‌ పర్సన్‌ దావ వసంతతో కలిసి నిర్వహించారు. ఈ సంధర్బంగా టీఆర్‌ఎస్‌ కార్య క ర్తలంతా ఒక కుటుంబమని, భిన్నాభిప్రాయాలు పక్కనపటెట్టి గ్రామాల్లో కి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచిం చారు. అనంతరం జగిత్యాల అర్బన్‌ మండలానికి చెందిన 15 మంది ఆడ బిడ్డలకు కళ్యాణలక్ష్మి చెక్కులను, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను లబ్దిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ఏ ర్పాటు తర్వాత సీఎం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొ న్నారు. సీఎం కేసీఆర్‌ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశా నికే మార్గదర్శిగా మారారని అన్నారు. దేశంలో పలు రాష్ట్రాలు తెలంగాణ సంక్షేమ పథకాలను అనుసరిస్తున్నాయని పేర్కొన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేయాలని, భేధాబిప్రాయాలు లేకుండా ముందు కుసాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మహేష్‌, ఏఎంసీ చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, మాజీఏఎంసీ చైర్మన్‌ దామోదర్‌ రావు, రైతుబంధుసపమితి కన్వీనర్‌ జుంబర్తి శంకర్‌, ప్యాక్స్‌ చైర్మన్‌ మహిపాల్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ శీలం సురేం దర్‌, అర్బన్‌ మండల, సర్పంచులు, ఎంపీటసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T00:11:23+05:30 IST

Read more