-
-
Home » Telangana » Karimnagar » Actions to be taken if expired medicines are sold-NGTS-Telangana
-
కాలపరిమితి ముగిసిన మందులు విక్రయిస్తే చర్యలు
ABN , First Publish Date - 2022-09-08T06:11:06+05:30 IST
అనుమతి లేని, కాలపరిమితి ముగిసిన మందులు, ఎరువులను రైతులకు విక్రయిస్తే అలాంటి షాపుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి పాక సురేష్ కుమార్ అన్నారు.

డీఏవో పాక సురేష్ కుమార్
జగిత్యాల అగ్రికల్చర్, సెప్టెంబరు 7: అనుమతి లేని, కాలపరిమితి ముగిసిన మందులు, ఎరువులను రైతులకు విక్రయిస్తే అలాంటి షాపుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి పాక సురేష్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పలు రైతు డిపోలు, ఇతర ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసి, అనుమతి పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సురేష్‌కుమార్ మాట్లాడుతూ రైతులు ఎరువులను కొనుగోలు చేస్తే విధిగా బిల్లులు పొందాలని సూచించారు. గడువు ముగిసిన ఎరువులు, మందులు విక్రయిస్తే అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నాణ్యత పరీక్షల నిమిత్తం వివిధ రకాల పురుగు మందుల నమూనాలను సేకరించి, పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు పంపించడం జరుగుతుందన్నారు. ఈ తనిఖీల్లో అర్బన్ మండల ఏవో వినీల తదితరులున్నారు.