సిరిసిల్లలో యారన్‌ డిపో ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2022-12-13T00:38:20+05:30 IST

సిరిసిల్లలో యారన్‌ డిపోను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి యారన్‌ సప్లయ్‌ చేయాలని బతుకమ్మ చీరల తయారీ కోసం మర మగ్గాలకు ఏర్పాటు చేసుకున్న డాబీలు, ఫింజర్లకు రావాల్సి సబ్సిడీ ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, అసాముల సమన్వయ కమిటీ అధ్యక్షుడు సిరిసిల్ల రవీందర్‌ పేర్కొన్నారు.

సిరిసిల్లలో యారన్‌ డిపో ఏర్పాటు చేయాలి
సిరిసిల్ల కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న అసాములు

సిరిసిల్ల కలెక్టరేట్‌, డిసెంబరు 12 : సిరిసిల్లలో యారన్‌ డిపోను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి యారన్‌ సప్లయ్‌ చేయాలని బతుకమ్మ చీరల తయారీ కోసం మర మగ్గాలకు ఏర్పాటు చేసుకున్న డాబీలు, ఫింజర్లకు రావాల్సి సబ్సిడీ ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, అసాముల సమన్వయ కమిటీ అధ్యక్షుడు సిరిసిల్ల రవీందర్‌ పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌లోని సీఐటీయూ కార్యాలయం నుంచి సీఐటీయూ అసాముల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో అసాములు బైక్‌లపై ర్యాలీగా కలెక్టరేటకు సోమవారం తరలివచ్చి ఫింజర్లు, డాబీలకు రావాల్సిన సబ్సిడీ డబ్బు లను అందించాలంటూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాబీలు, ఫింజర్లకు సంబంధించిన సబ్సిడీని చేనేత జౌళీశాఖ అధికారులు ఇచ్చిన హామీ ప్రకారం రూ. 15 వేలను పూర్తిగా అందించడంతో పాటు ప్రభుత్వం ఆర్డర్‌ వస్త్రాలకు ఆసాములకు కూలీ పెంచి నిర్ణయించాలన్నారు. ప్రభుత్వ అర్డర్‌ వస్త్రాలను మ్యాక్స్‌ సొసైటీల ద్వారానే ఎస్‌ఎస్‌ఐ యూనిట్ల ద్వారానే ఇవ్వాల న్నారు. మ్యాక్స్‌ సంఘాలలో ఉన్న సభ్యులకు ఇతర సంఘాలలో చేరే అవకాశం కల్పించాలన్నారు. మరమగ్గాలు లేని సభ్యులను సంఘం నుంచి తొలగించి సంఘాలను రద్దు చేయాలన్నారు. యారన్‌ డిపోను ఏర్పాటు చేసి యారన్‌ను అందించాలని అలాగే అసాములు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే విధంగా పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కారించే విధంగా కృషి చేయాలని లేకుంటే చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టి చేనేత జౌళీశాఖ కమిషనరేట్‌ను ముట్టడిస్తామంటూ జిల్లా అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో అసాము ల సమన్వయ కమిటి ప్రధానకార్యదర్శి చేరాల అశోక్‌, ఉపాధ్యక్షుడు కొండ సుభాష్‌, పోరండ్ల శ్రీనివాస్‌ , మండల రాజు, సత్యనారాయణ, శంకర్‌ ఉన్నారు.

Updated Date - 2022-12-13T00:38:20+05:30 IST

Read more