317 జీవోను నిలుపుదల చేయాలి

ABN , First Publish Date - 2022-01-03T06:55:19+05:30 IST

ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులకు స్థానికతను పరిరక్షింపబడే విధంగా రూపొందించిన ఆర్టికల్‌ 371-డీకి విఘాతం కలిగించేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం జారీచే సిన జీవో నెంబర్‌ 317ను తక్షణమే నిలుపుదల చేపించి స్థానికత ప్రాతిపదికగా కేటా యింపు లు చేపట్టాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు

317 జీవోను నిలుపుదల చేయాలి
సీఎం కేసీఆర్‌కు రాసిన లెటర్‌ను చూపిస్తున్న జీవన్‌ రెడ్డి

స్థానికత పరిరక్షింపబడే బాధ్యత సీఎందే

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

జగిత్యాల టౌన్‌, జనవరి 2 : ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులకు స్థానికతను పరిరక్షింపబడే విధంగా రూపొందించిన ఆర్టికల్‌ 371-డీకి విఘాతం కలిగించేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం జారీచే సిన జీవో నెంబర్‌ 317ను తక్షణమే నిలుపుదల చేపించి స్థానికత ప్రాతిపదికగా కేటా యింపు లు చేపట్టాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని ఇంధిరా భవన్‌లో ఆదివారం ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక లేఖను రాసిన అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఉద్యోగం పొందిన నాటి స్థానికత ను పరిగణలోకి తీసుకోకుండా కేవలం సీనియారాటీని మాత్రమే పరిగణలోకి తీసుకునే విధం గా రాష్ట్ర ప్రభుత్వం 317 జీవో జారీ చేయడంతో ఉపాధ్యాయుల్లో కొత్త ఆందోళనకు తెరతీసిం దన్నారు. ఆ జీవోకు వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాద్యాయ సంఘాల నిరసన కార్యక్రమాలు చేపట్టి విజ్ఞప్తులు చేస్తుంటే ప్రభుత్వం మాత్రం వేటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా నియంతృత్వ విధానాన్ని అవలంభిస్తోందని మండిపడ్డారు. జీవో 317 ఉత్తర్వులతో కేవలం సీనియారిటీ ప్రా తిపదికన మాత్రమే ఉద్యోగ, ఉపాధ్యాయులు నూతన జిల్లాలకు కేటాయించే పరిస్థితి ఉంటుం దన్నారు. ఇదే పరిస్థితుల్లో స్థానికతను కలిగి ఉన్న జూనియర్‌ ఉద్యోగులు వేరే జిల్లా లకు ఒకే ప్రాంతానికి కేటాయింపు చేయబడే పరిస్థితి ఎక్కువగా ఉండడంతో భవిష్యత్‌ ఉద్యోగ నియామ కాల్లో నిరుద్యోగులకు అన్యాయం జరగక తప్పదన్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి, అన్నీ తెలిసిన చీఫ్‌ సెక్రటరికీ సూచనలు, న్యాయ సలహాలు ఎవరు సూచిస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌ ఫ్రీ జోన్‌కు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టా మని ఇప్పటి పాలకులు హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా మార్చారన్నారు. తక్షణమే 317 జీవోను ని లుపుదల చేపించి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు అఖిల పక్ష నాయకులతో చర్చించి  సీఎం కేసీఆర్‌ తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షు డు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బండ శంకర్‌, మాజీ మున్సిఫల్‌ చైర్మన్‌ గిరి నాగభూషణం, నాయకులు గాజుల రాజేందర్‌, దేవేందర్‌ రెడ్డి, జున్ను రాజేందర్‌, అశోక్‌, దుర్గయ్య, మధు, రాజేష్‌, ఎండీ రియాజ్‌, మహేష్‌, రజనీకాంత్‌, జగన్‌ ఉన్నారు.

Updated Date - 2022-01-03T06:55:19+05:30 IST