కాళోజీ స్మారక పురస్కారాలకు ఇద్దరి ఎంపిక

ABN , First Publish Date - 2022-09-12T05:27:18+05:30 IST

కాళోజీ స్మారక పురస్కారాలకు ఇద్దరి ఎంపిక

కాళోజీ స్మారక పురస్కారాలకు  ఇద్దరి ఎంపిక

హనుమకొండ కల్చరల్‌, సెప్టెంబరు 11: 2022 సంవత్సరానికి కాళోజీ సోదరుల స్మారక పురస్కారాలను కాళోజీ ఫౌండేషన్‌ అధ్యక్షు డు నాగిళ్ల రామశాస్త్రి, కార్యదర్శి వీఆర్‌ విద్యార్థి ఆదివారం ప్రకటించా రు. కాళోజీ రామేశ్వర్‌రావు (షాద్‌) స్మారక పురస్కారం ప్రముఖ ఉర్దూ కవి, విమర్శకుడు, అనువాదకుడు, గాలిబ్‌ అకాడమీ అధ్యక్షుడు డాక్టర్‌ కుతుబ్‌షర్‌ షార్‌కు, ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్మారక పురస్కారం ప్రముఖ పాత్రికేయుడు, సుప్రసిద్ధ సంపాదకుడు కె.చంద్రమూర్తికి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ స్మారక పురస్కారాలు నవంబరు 13న జరిగే కాళోజీ సోదరుల యాది సభలో ప్రదానం చేయనున్నట్లు వారు వెల్లడించారు.

Read more