Gajendra Singh Shekhawat: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-08-18T04:05:35+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు...

Gajendra Singh Shekhawat: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ (New Delhi): కాళేశ్వరం ప్రాజెక్ట్‌ (Kaleswaram)పై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Central minister Gajendra Singh Shekhawat) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంలో హద్దులు దాటిన అవినీతి జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ (Telangana) ప్రజల డ్రీమ్ ప్రాజెక్ట్ పేరుతో అబద్దాలు చెప్పి జనాన్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు.  భారీ వర్షాలకు మూడు పంపు హౌజ్‌లు మునిగిపోయాయన్నారు. పంపులను టెక్నికల్‌గా సరైన పద్ధతిలో అమర్చలేదని చెప్పారు. ప్రాజెక్ట్ నిర్మించినప్పుడే వేల కోట్ల అవినీతి జరిగిందని తెలిపారు. పంపుల రిపేర్లలోనూ అవినీతి జరిగిందని మండిపడ్డారు. మోటార్లు బిగించిన సంస్థకు టెక్నికల్ సామర్థ్యం లేదని వెల్లడించారు. అమర్చడంలోనూ సరైన పద్ధతి పాటించలేదని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. 

Read more