మునుగోడులో పుట్టినరోజు వేడుకల్లో కేఏ పాల్

ABN , First Publish Date - 2022-09-26T01:39:23+05:30 IST

మునుగోడులో 59వ పుట్టినరోజు వేడుకలను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) జరుపుకున్నారు. ఈ వేడుకకు ప్రజా గాయకుడు గద్దర్ హాజరయ్యారు.

మునుగోడులో పుట్టినరోజు వేడుకల్లో కేఏ పాల్

నల్గొండ: మునుగోడులో 59వ పుట్టినరోజు వేడుకలను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) జరుపుకున్నారు. ఈ వేడుకకు ప్రజా గాయకుడు గద్దర్ హాజరయ్యారు. పాల్ పుట్టినరోజు రోజు సందర్భంగా 59 మందిని అమెరికా పంపించడానికి డ్రా పద్ధ తిలో ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. అన్నిపార్టీలు అభ్యర్థిని ప్రకటించినా.. టీఆర్ఎస్ మాత్రం అభ్యర్థిని ప్రకటించలేదని కేసీఆర్ అది నా కోసమే.. అనుకుంటున్నానని అన్నారు. తనకు టికెట్ ఇస్తే లక్ష కోట్లు రాష్ట్రాభివృద్ధికి తెస్తానని చెప్పారు. ఆరు నెలల్లో మునుగోడును అమెరికా చేస్తా, ప్రతి మండలంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తానని కేఏ పాల్ తెలిపారు.

Read more