జూరాల ప్రాజెక్ట్ 23 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2022-07-18T13:46:51+05:30 IST

జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లో వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ముందు జాగ్రత్తగా

జూరాల ప్రాజెక్ట్ 23 గేట్లు ఎత్తివేత

మహబూబ్ నగర్: జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లో వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ముందు జాగ్రత్తగా ప్రాజెక్ట్ 23 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జూరాల ఇన్‌ఫ్లో 1,76,000 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 1,74,383 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318 అడుగులు కాగా, ప్రస్తుతం 317 అడుగులుగా ఉంది.

Updated Date - 2022-07-18T13:46:51+05:30 IST