మానవ అక్రమ రవాణాను అరికట్టాలి

ABN , First Publish Date - 2022-09-08T06:08:43+05:30 IST

మానవ అక్రమ రవాణాను అరికట్టాలి

మానవ అక్రమ రవాణాను అరికట్టాలి

సీనియర్‌ సివిల్‌ జడ్జి ఉపేందర్‌రావు

ఖిలావరంగల్‌, సెప్టెంబరు 7: దేశంలో మానవ, బాలల అక్రమ రవాణాను ప్రజలు అరికట్టాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి, లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ వరంగల్‌ సెక్రెటరీ జె.ఉపేందర్‌రావు అన్నారు. నగరంలోని దూపకుంట మైనార్టీ పాఠశాలలో బుధవారం ప్రిన్సిపాల్‌ పి.మాధవి అధ్యక్షతన అభ్యుదయ సేవా సమితి, ఎఫ్‌ఎంఎం సామాజిక సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ భారతదేశంలో మానవ, బాలల అక్రమ రవాణా కేంద్రంగా మారిందన్నారు. మానవ అక్రమ రవాణాకు మూలం తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు, అవగాహన లోపమేనన్నారు. తల్లిదండ్ర ులు పిల్ల్లలను పాఠశాలల్లో చేర్పించి మంచి విద్య నందించాలన్నారు. విద్యార్థులకు సమాజంలో, ఇంటి వద్ద ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్భంలో చైల్డ్‌లైన్‌ టోల్‌ ఫ్రీ 1098, 100 నెంబర్లకు ఫోన్‌ చేయాలన్నారు. కార్యక్రమంలో చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ మాజీ చైర్‌పర్సన్‌ మండల పరశురాములు, చైల్డ్‌ లైన్‌ కో-ఆర్డినేటర్‌ వీరబాబు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-08T06:08:43+05:30 IST