ఘనంగా జిల్లా ఆవిర్భావ వేడుకలు

ABN , First Publish Date - 2022-10-12T05:36:37+05:30 IST

ఘనంగా జిల్లా ఆవిర్భావ వేడుకలు

ఘనంగా జిల్లా ఆవిర్భావ వేడుకలు

జనగామ కల్చరల్‌, అక్టోబరు 11 : జిల్లా ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. జనగామ జిల్లా కేంద్రంలోని స్ఫూర్తి స్థూపం వద్ద జేఏసీ కన్వీనర్‌ మంగళంపల్లి రాజు జాతీయ జెండా ఆవిష్కరించి, వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యమకారుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి మాట్లాడారు. జిల్లా ఏర్పడి 6 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ అభివృద్ధిలో మాత్రం వెనుకబడి పోయిందన్నారు. ఉపాధి అవకాశాలు ఏర్పడతాయనుకుంటే వలసలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకుడు బొట్ల శ్రీనివాస్‌ మాట్లాడుతూ జిల్లా నాయకులకు దమ్ముంటే ఇండస్ట్రియల్‌ కారిడార్‌ తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ నాయకుడు ఉడుగుల రమేష్‌ మాట్లాడుతూ జనగామ జిల్లా ఉద్యమకారుల త్యాగం వల్ల ఏర్పడిందన్నారు. పిట్టల సురేష్‌, ఎండీ అన్వర్‌ మాట్లాడుతూ అధికారికంగా జనగామ జిల్లా ఆవిర్భావ వేడుకలు జరపాలని డిమాండ్‌ చేశారు. జరసం నాయకులు జి.కృష్ణ, సోమేశ్వరాచారి మాట్లాడుతూ పాట తో జనగామ జిల్లా వచ్చిందని, ఇప్పుడు అభివృద్ధిలో కూడా పాట పాత్ర ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు గన్ను కార్తీక్‌, కార్యదర్శి తుంగ కౌశిక్‌, పట్టణ అధ్యక్షుడు వెంపటి అజయ్‌, బీసీ ఐక్యవేదిక కన్వీనర్‌ ఆసర్ల సుభాష్‌, హరీష్‌ పాల్గొన్నారు.

 బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా ఆవిర్భావ వేడుకలు జరిగాయి. జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి కేకు కట్‌చేసి సంబరాలు నిర్వహించి మాట్లాడారు. అన్ని వర్గాలు, కులాలు, మతాలు, సబ్బండ వర్గాల పోరాటాల ఫలితమే జనగామ జిల్లా ఆవిర్భావమన్నారు. కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్‌, సౌడ రమేష్‌, హరిశ్చంద్రగుప్త, కొంతం శ్రీనివాస్‌, యుగేందర్‌రెడ్డి, గుజ్జుల నారాయణ, పిట్టల సత్యం, సుభాష్‌, మహిపాల్‌, కోట వినోద్‌, అంజిరెడ్డి, పెద్దోజు జగదీష్‌, సంపత్‌, కాసుల శ్రీనివాస్‌, బాలల నవీన్‌రెడ్డి, తోకల హరీష్‌, ఆకుల క్రాంతి, శ్రీకాంత్‌, కొంగరి అనిల్‌, కీర్తి వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Read more