జేఈఈ మెయిన్‌ ఫైనల్‌కీ విడుదల

ABN , First Publish Date - 2022-07-07T09:34:20+05:30 IST

జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 పరీక్షకు సంబంధించిన ఫైనల్‌ కీని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ బుధవారం విడుదల చేసింది.

జేఈఈ మెయిన్‌  ఫైనల్‌కీ విడుదల

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి) : జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 పరీక్షకు సంబంధించిన ఫైనల్‌ కీని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ బుధవారం విడుదల చేసింది. జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 పరీక్షలు జూన్‌ 23-29 తేదీల్లో జరిగాయి. ఇందుకు సంబంధించిన ప్రాథమిక కీని ఈ నెల 2న విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం బుధవారం రాత్రి తుది కీ విడుదల చేశారు. కాగా, ప్రాథమిక కీ తో పోలిస్తే ఫైనల్‌ కీలో పలు మార్పులు జరిగాయి. ముఖ్యంగా రసాయన శాస్త్రంలోని కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మారాయి. గణితంలో రెండు ప్రశ్నలను తొలగించారు. ఈ ప్రశ్నలకు సమాధానం రాసిన ప్రతీ విద్యార్థికి నిర్దేశిత మార్కులు ఇస్తారు. 

Read more