ఇద్దరు రైతుల ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-02-23T08:12:18+05:30 IST
అప్పుల బాధతో ఇద్దరు రైతులు బలవన్మరణం చెందారు.

పాలకుర్తి/మల్హర్, ఫిబ్రవరి 22: అప్పుల బాధతో ఇద్దరు రైతులు బలవన్మరణం చెందారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గోప్యతండాకు చెందిన భూక్యా రమే్ష(25)మూడెకరాల్లో వేసిన మిర్చికి తెగుళ్లు సోకాయి. దీంతో పెట్టుబడి రాలేదు. సాగు కోసం చేసిన అప్పులు 8లక్షలకు చేరడంతో మంగళవారం పురుగుమందు తాగాడు. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం గట్టుపల్లిలో పోటు రమే్షరెడ్డి(35) ఆరెకరాల్లో వరి వేయగా దిగుబడి రాలేదు. పెట్టుబడి కోసం తెచ్చిన రూ.10లక్షలు తీర్చే మార్గం కానరాక సోమవారం పురుగు మందుతాగాడు. చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు.