kavitha: టీఆర్‌ఎస్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే

ABN , First Publish Date - 2022-12-04T21:13:59+05:30 IST

ప్రజల మద్దతు ఉన్నంత కాలం టీఆర్‌ఎస్‌ (TRS)ను ఏ పార్టీ ఏమీ చేయదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (kavitha) ధీమా వ్యక్తం చేశారు.

kavitha: టీఆర్‌ఎస్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే

ఆలేరు: ప్రజల మద్దతు ఉన్నంత కాలం టీఆర్‌ఎస్‌ (TRS)ను ఏ పార్టీ ఏమీ చేయదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (kavitha) ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు శ్రీరామరక్షగా ఉన్న టీఆర్‌ఎస్‌కు కాపాడుకోవల్సిన బాధ్యత ప్రజలదేనని అన్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధి తెలంగాణ రాష్ట్రానికే కాకుండా యావత్‌ భారతదేశానికి తలమానికంగా నిలిచిందన్నారు. యాదాద్రి క్షేత్రాన్ని అభివృద్ధి చేయడంలో గత పాలకులు ఎవరూ పట్టించుకోలేదని, తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు క్షేత్రాన్ని అభివృద్ధి చేసి అద్భుత క్షేత్రంగా తీర్చిదిద్దారని చెప్పారు. యాదాద్రిలో జరిగిన ఆలయ నిర్మాణం ఒక్క తెలంగాణకే కాకుండా యావత్‌ భారతదేశానికి కూడా తలమానికంగా ఉందని ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటున్నారన్నారు.

ఈ జిల్లా ప్రాంత ప్రజలందరూ 2001 నుంచీ టీఆర్‌ఎస్‌కు పూర్తి అండదండలు అందిస్తూ తెలంగాణ ఉద్యమం నడిపించిన ఘనత ఉందన్నారు. ఉద్యమంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌కు వరుస విజయాలు అందిస్తున్నారన్నారు. ప్రజల మద్దతు ఉన్నంత కాలం టీఆర్‌ఎస్‌ను ఏ పార్టీ ఏమీ చేయదని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు శ్రీరామ రక్షగా ఉన్న టీఆర్‌ఎస్‌ను ప్రజలే కాపాడుకుంటామని తెలిపారు. ఈరోజు రకరకాల పార్టీలు వస్తున్నాయని, రకరకాల మాటలు మాట్లాడుతున్నాయని, రకరకాలుగా ప్రజా ప్రతినిధులను నిందించే ప్రయత్నాలు చేస్తున్నారని, వాటిని గమనించాలని ప్రజలను కోరారు. అనేక రకాల అంశాలతో మనల్ని ఆగం చేసే ప్రయత్నం ఉద్యమ సందర్భం నుంచి చూశామన్నారు. ఆగం కాలేదు కాబట్టే తెలంగాణ వచ్చిందని, తెలంగాణకు శ్రీరామరక్ష అయిన తెలంగాణ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని కవిత చెప్పారు.

Updated Date - 2022-12-04T21:14:00+05:30 IST