Inorbit Mall: ఆకర్షణీయమైన పండుగ ఆఫర్లు.. కళకళలాడిపోతున్న ఇనార్బిట్ మాల్

ABN , First Publish Date - 2022-10-02T02:02:54+05:30 IST

ఈ పండుగ సీజన్‌లో ఇనార్బిట్‌మాల్ పలు ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఉత్సాహపూరితమైన ఆఫర్లు

Inorbit Mall: ఆకర్షణీయమైన పండుగ ఆఫర్లు.. కళకళలాడిపోతున్న ఇనార్బిట్ మాల్

హైదరాబాద్: ఈ పండుగ సీజన్‌లో ఇనార్బిట్‌మాల్ పలు ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఉత్సాహపూరితమైన ఆఫర్లు, వేడుకలు, ఇతర కార్యక్రమాలతో సందర్శకులను ఆహ్వానిస్తోంది. మాల్‌లోకి అడుగుపెడుతూనే ఈ పండుగ సీజన్‌లో అక్కడేం జరుగుతోందో తెలుసుకునేలా తీర్చిదిద్దారు. ప్రకాశవంతమైన బంగారం, క్రిస్టల్‌ నేపథ్యంతో తీర్చిదిద్దిన డెకార్‌ ఆకర్షణీయంగా ఉంది.


అందమైన పీకాక్‌ హ్యంగింగ్స్‌ అట్రియంలో ఉండి పండుగ స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నాయి.  షాపర్ల కోసం ఇనార్బిట్‌ మాల్‌ అసంఖ్యాక ఆఫర్లను తీసుకొచ్చింది. ఫిజ్జీ గోబ్లెట్‌, మాన్యవర్‌, సోచ్‌, బిబా వంటివి  పండుగ కలెక్షన్స్‌ను ప్రదర్శిస్తున్నాయి. పాంటాలూన్స్‌ తమ కలెక్షన్‌పై 40 నుంచి 70 శాతం తగ్గింపు అందిస్తుండగా,  మ్యాక్స్‌, అండ్‌, లైఫ్‌స్టైల్‌ వంటివి కొనుగోళ్లతో పలు బహుమతులు అందిస్తున్నాయి. ఒరా జ్యువెలరీ బ్రాండ్‌ వజ్రాభరణాల శ్రేణిపై  25శాతం వరకు రాయితీని ఆపర్ చేస్తోంది. మేకింగ్  చార్జీలపై బ్లూ స్టోన్‌ 25 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. బజాజ్‌ ఎలక్ట్రానిక్స్ కోటి రూపాయలకు పైగా లక్కీ డ్రా నిర్వహిస్తోంది.


వీటతోపాటు ‘యువర్‌ స్పెండింగ్‌ ఈజ్‌ రివార్డింగ్‌’ కార్యక్రమంలో భాగంగా వినియోగదారులు తమ బిల్స్‌ను అందించినా, లేదంటే రిడీమ్‌ చేసుకున్నా ఇన్‌ కాయిన్స్‌ లభిస్తాయి. వినియోగదారులకు ఈ దిశగా సహాయపడేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌ డెస్క్‌ సైతం ఏర్పాటుచేశారు. అంతేకాదు,  సందర్శకులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి బ్రాండ్‌ ఓచర్లు, ఇన్‌ కాయిన్స్‌ కూడా గెలుచుకోవచ్చు.  

Read more